న్యూజిలాండ్ తో తోలివన్డేలో స్లో ఓవర్‌రేట్‌ కారణంగా భారత్‌ జట్టుకు జరిమానా

India Cricket Team Penalised for Maintaining Slow Over-rate Against New Zealand in the First ODI in Hyderabad,India Cricket Team Penalised,Maintaining Slow Over-rate,Against New Zealand,First ODI in Hyderabad,Mango News,Mango News Telugu,India Vs New Zealand Live,India Vs New Zealand Live Score,India Vs New Zealand 2023,India Vs New Zealand Wtc Final,India Vs New Zealand Live Score 2023,India Vs New Zealand 2Nd Test 2023,India Vs New Zealand Test 2023,India Vs New Zealand Highlights,India A Vs New Zealand A Live Score Today,India Legends Vs New Zealand Legends,Indian Vs New Zealand,India A Vs New Zealand A Today Match

భారత్, న్యూజిలాండ్‌ మధ్య మూడు వన్డేల సిరీస్ లో భాగంగా జనవరి 18న హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరిగిన తోలి వన్డేలో భారత్ ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. కాగా ఈ మ్యాచ్ లో భారత్ జట్టుకు షాక్ తగిలింది. ఈ వన్డేలో నిర్ణీత సమయంలో ఓవర్ల కోటాను ముగించనందు వలన ఐసీసీ భారీ జరిమానా విధించింది. న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో స్లో ఓవర్‌రేట్ కారణంగా భారత్ ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 60 శాతం జరిమానా విధించినట్టు ప్రకటించారు. నిర్దేశించిన సమయం ముగిసేలోగా భారత్ జట్టు 3 ఓవర్లు తక్కువ వేసింది. నిబంధనలను అనుసరించి ఒక్కో ఓవర్‌కు 20 శాతం చొప్పున 3 ఓవర్లకు 60 శాతం మ్యాచు ఫీజు కోత విధిస్తున్నట్టు పేర్కొన్నారు.

ముందుగా భారత్ జట్టు తమ టార్గెట్ కు మూడు ఓవర్లు తక్కువగా వేసిందని ఐసీసీ రిఫరీ జవగల్ శ్రీనాథ్ తీర్పు ఇచ్చారు. ఈ నిర్ణయానికి వచ్చే ముందు టైమ్ అలవన్స్ ను పరిగణనలోకి తీసుకున్నట్టు తెలిపారు. ప్లేయర్స్ మరియు ప్లేయర్ సపోర్ట్ పర్సనల్ కోసం రూపొందించిన ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.22 ప్రకారం, నిర్ణీత సమయంలో బౌలింగ్ చేయడంలో విఫలమైన ప్రతి ఓవర్‌కు ఆటగాళ్లకు వారి మ్యాచ్ ఫీజులో 20 శాతం జరిమానా విధించబడుతుందని చెప్పారు. ఆన్ ఫీల్డ్ అంపైర్లు అనిల్ చౌదరి, నితిన్ మీనన్, థర్డ్ అంపైర్ కేఎన్ అనంతపద్మనాభన్, ఫోర్త్ అంపైర్ జయరామన్ మదనగోపాల్‌లు లేవనెత్తిన స్లో ఓవర్ రేట్ విషయంలో, భారత కెప్టెన్ రోహిత్ శర్మ తన పొరపాటును అంగీకరించి జరిమానా ప్రతిపాదనకు ఒప్పుకోవడంతో ఎటువంటి అధికారిక విచారణ అవసరం ఉండదని తెలిపారు. ఇక భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జనవరి 21న రాయ్ పూర్ లో రెండో వన్డే, జనవరి 24న ఇండోర్ లో మూడో వన్డే జరగనుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × 5 =