కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు శుభవార్త, డీఏ, డీఆర్ 28 శాతానికి పెంపు

7th Pay Commission, 7th Pay Commission DA Hike Latest Update, 7th Pay Commission Dearness Allowance, Cabinet approves increase in Dearness Allowance, Central Govt Employees, Central Govt Employees Dearness Allowance Increased, Central Govt Employees Dearness Allowance Increased to 28 Percent, Centre Hikes Central Govt Employees, Centre hikes DA for central govt, Centre may announce DA hike, DA for central govt employees hiked to 28%, DA for central govt employees hiked to 28% with effect, Mango News, Union Cabinet approves 28% DA hike, Union Cabinet Decisions

ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం నాడు జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. సమావేశం అనంతరం కేంద్ర కేబినెట్ నిర్ణయాలను కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ మీడియాకు వెల్లడించారు.

కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు:

  • కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు. డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ) ను 17 శాతం నుండి 28 శాతం పెంపుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. డీఏ పెంపు జూలై 1, 2021 నుండి వర్తిస్తుందని ప్రకటించారు. కరోనా మహమ్మారి కారణంగా ఏర్పడ్డ పరిస్థితుల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ), పెన్షనర్లకు డియర్‌నెస్ రిలీఫ్ (డీఆర్) యొక్క మూడు అదనపు వాయిదాలు (జనవరి 1, 2020, జూలై 1,2020, జనవరి 1,2021) స్తంభింపజేయబడ్డాయని పేర్కొన్నారు. తాజాగా ప్రస్తుతం 17 శాతంగా ఉన్న డీఏ, డీఆర్ ను 11 శాతం పెంపుతో 28 శాతానికి పెంచుతున్నట్టు తెలిపారు.
  • దుస్తులు/వస్త్రాలు మరియు మేడ్-అప్స్ ఎగుమతిపై రాష్ట్ర మరియు కేంద్ర పన్నులు మరియు లెవీలను (ఆర్ఓఎస్టీటీఎల్) కొనసాగించడానికి కేబినెట్ ఆమోదం. ప్రస్తుత రేట్ల ప్రకారమే ఆర్ఓఎస్టీటీఎల్ మార్చి 31, 2024 వరకు పొడిగింపు.
  • ఆరోగ్య మరియు ఔషధ రంగంలో సహకారంపై భారత్ మరియు డెన్మార్క్ కింగ్ డమ్ మధ్య అవగాహన ఒప్పందం (ఏంఓయూ) కు కేబినెట్ ఆమోదం.
  • స్టీల్ తయారీకి ఉపయోగించే కోకింగ్ బొగ్గుకు సంబంధించి సహకారంపై భారత్ మరియు రష్యన్ ఫెడరేషన్ మధ్య ఏంఓయూకు ఆమోదం.
  • కేంద్ర జాబితాలోని ఇతర వెనుకబడిన తరగతులలో ఉప-వర్గీకరణ సమస్యను పరిశీలించడానికి రాజ్యాంగంలోని ఆర్టికల్ 340 కింద ఏర్పాటు చేసిన కమిషన్ కాలపరిమితిని పొడిగింపుకు ఆమోదం.
  • న్యాయవ్యవస్థ కోసం మౌలిక సదుపాయాల సౌకర్యాల అభివృద్ధికై సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ (సిఎస్ఎస్) ను ఐదేళ్ల పాటు కొనసాగించాలని కేబినెట్ ఆమోదం. మొత్తం రూ.9000 కోట్లులో, సెంట్రల్ షేర్ రూ.5357 కోట్లుగా ప్రకటన.
  • కేంద్ర ప్రాయోజిత పథకం నేషనల్ ఆయుష్ మిషన్ కొనసాగింపుకు కేబినెట్ ఆమోదం. ఏప్రిల్ 1, 2021 నుండి మార్చి 31, 2026 వరకు రూ. 4607.30 కోట్లు కేటాయింపు. సెంట్రల్ షేర్‌ రూ.3 వేల కోట్లు కాగా, రాష్ట్ర వాటాగా రూ.1607.30 కోట్లు అని వెల్లడి.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 − one =