ఎన్ఐఆర్ఎఫ్ ఇండియా ర్యాంకింగ్స్-2022: దేశంలో అత్యుత్తమ విద్యాసంస్థగా ఐఐటీ మద్రాస్

Union Education Minister Dharmendra Pradhan Released NIRF India Rankings-2022 IIT Madras Tops, Dharmendra Pradhan Released NIRF India Rankings-2022, IIT Madras Tops, NIRF India Rankings-2022, 2022 NIRF India Rankings, IIT Madras Secures 1st Rank In 2022 Institutions Ranking Announces Edu Minister, Edu Minister Says IIT Madras Secures 1st Rank In 2022 Institutions Ranking, IIT Madras Secures 1st Rank In 2022 Institutions Ranking, 2022 Institutions Ranking, Institutions Ranking 2022, Institutions Ranking, IIT Madras, Minister of Education, Union Education Minister Dharmendra Pradhan, Education Minister Dharmendra Pradhan, Union Education Minister, Dharmendra Pradhan, India Rankings 2022 under the National Institute Ranking Framework, National Institute Ranking Framework, NIRF India Rankings-2022 News, NIRF India Rankings-2022 Latest News, NIRF India Rankings-2022 Latest Updates, NIRF India Rankings-2022 Live Updates, Mango News, Mango News Telugu,

దేశంలోని అత్యుత్తమ ఉన్నత విద్యా సంస్థలు మరియు విశ్వవిద్యాలయాలను జాబితాను కేంద్రం శుక్రవారం విడుదల చేసింది. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ (ఎన్ఐఆర్ఎఫ్) కింద ఈ సంవత్సరం ఇండియా ర్యాంకింగ్స్-2022 ను కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ విడుదల చేశారు . ఓవరాల్, విశ్వవిద్యాలయాలు, ఇంజనీరింగ్, మేనేజిమెంట్, ఫార్మసీ, కాలేజీలు, మెడికల్, లా, డెంటల్, రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఆర్కిటెక్చర్ కేటగిరీల్లో ర్యాంకులను ప్రకటించారు. దేశంలో ఓవరాల్ విద్యాసంస్థల జాబితాలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) మద్రాస్ ఉన్నత విద్య కోసం అత్యుత్తమ సంస్థగా మొదటి స్థానాల్లో నిలిచింది. ఐఐటీ మద్రాస్ వరుసగా నాలుగో ఏడాది కూడా తన అగ్రస్థానాన్ని నిలుపుకుంది.

ఇక రెండవ స్థానంలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) బెంగళూరు నిలిచింది. ఈ కార్యక్రమంలో భాగంగా కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఉన్నత స్థాయి విద్యాసంస్థలకు అవార్డులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఉన్నత విద్యలో నాణ్యతను మెరుగుపరచడానికి బలమైన, ఆబ్జెక్టివ్ ఫ్రేమ్‌వర్క్ మరియు అక్రిడిటేషన్, ర్యాంకింగ్ ముఖ్యమన్నారు. డిజిటల్ ఆర్థిక వ్యవస్థను సృష్టించడంలో భారత్ అగ్రగామిగా ఉందని, సాంకేతికత, ఆవిష్కరణలతో నడిచే విజ్ఞాన ఆధారిత ఆర్థిక వ్యవస్థను రూపొందించడానికి ముందుకు సాగుతుందని మంత్రి పేర్కొన్నారు.

ఎన్ఐఆర్ఎఫ్ 2022: దేశంలోని ఓవరాల్ అత్యుత్తమ టాప్ 10 విద్యాసంస్థల జాబితా:

  1. ఐఐటీ మద్రాస్
  2. ఐఐఎస్సీ బెంగళూరు
  3. ఐఐటీ బాంబే
  4. ఐఐటీ ఢిల్లీ
  5. ఐఐటీ కాన్పూర్
  6. ఐఐటీ ఖరగ్‌పూర్
  7. ఐఐటీ రూర్కీ
  8. ఐఐటీ గౌహతి
  9. ఎయిమ్స్, న్యూఢిల్లీ
  10. జేఎన్యూ, ​​న్యూఢిల్లీ

ఎన్ఐఆర్ఎఫ్ 2022: దేశంలోని అత్యుత్తమ టాప్ 10 యూనివర్సిటీల జాబితా:

  1. ఐఐఎస్సీ బెంగళూరు
  2. జేఎన్యూ, ​​న్యూఢిల్లీ
  3. జామియా మిలియా ఇస్లామియా, న్యూఢిల్లీ
  4. జాదవ్‌పూర్ యూనివర్సిటీ, కోల్ కతా
  5. అమృత విశ్వ విద్యాపీఠం, కోయంబత్తూర్
  6. బనారస్ హిందూ యూనివర్సిటీ, వారణాసి
  7. మణిపాల్ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్, మణిపాల్
  8. కలకత్తా యూనివర్సిటీ, కోల్ కతా
  9. వెల్లూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, వెల్లూర్
  10. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, హైదరాబాద్.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four + seventeen =