పశ్చిమ బెంగాల్‌లో సెప్టెంబర్ 30 వరకు లాక్‌డౌన్ పొడిగింపు

West Bengal, West Bengal COVID 19, West Bengal Extends Lockdown, West Bengal Government Extends Lockdown, West Bengal Government Lockdown, west bengal lockdown, west bengal lockdown extension, west bengal lockdown guidelines, West Bengal Lockdown News, west bengal lockdown rules

రాష్ట్రంలో సెప్టెంబర్ 30 వరకు లాక్‌డౌన్‌ ను పొడిగిస్తునట్టు సోమవారం నాడు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ప్రకటించింది. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా రాష్ట్రంలోని కంటైన్మెంట్ ప్రాంతాల్లో లాక్‌డౌన్ ను సెప్టెంబర్ 30 వరకు పొడిగించాలని నిర్ణయించినట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అలాగే తాజా మార్గదర్శకాల ప్రకారం, పశ్చిమ బెంగాల్‌లో మెట్రో సేవలను సెప్టెంబర్ 8 నుంచి గ్రేడెడ్ పద్ధతిలో తిరిగి ప్రారంభించడానికి అనుమతి ఇచ్చారు. కంటైన్మెంట్ జోన్ల వెలుపల సెప్టెంబర్ 21 నుండి ఓపెన్ ఎయిర్ థియేటర్లను కూడా తెరవనున్నారు.

అయితే రాష్ట్రంలో పాఠశాలలు, కళాశాలలు, కోచింగ్ సంస్థలు, సినిమా థియేటర్స్, జిమ్స్, స్విమ్మింగ్ పూల్స్, ఎంటర్టైన్మెంట్ పార్క్స్, ఊరేగింపులు, ప్రజలు గుమికూడడంపై సెప్టెంబర్ 30 వరకు నిషేధం కొనసాగుతుందని తెలిపారు. ఇక పూర్తిస్థాయి లాక్‌డౌన్ విధించే సెప్టెంబర్ 7, 11 మరియు 12 తేదీల్లో ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, వాణిజ్య సంస్థలు, ట్రైన్స్, ప్రయాణికుల విమానాలు సహా పబ్లిక్, ప్రైవేట్ ట్రాన్స్ పోర్ట్ పూర్తిగా మూసివేయాలని ప్రకటించారు. మరోవైపు పశ్చిమ బెంగాల్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,59,785 కి చేరగా, 3,176 మంది మరణించారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × three =