కేఫ్ కాఫీ డే ఫౌండర్ సిద్ధార్థ అదృశ్యం

Cafe Coffee Day Founder VG Siddhartha Missing In Mangaluru,Cafe Coffee Day Founder,Cafe Coffee Day Founder Missing,Cafe Coffee Day Founder VG Siddhartha,VG Siddhartha Missing In Mangaluru,VG Siddhartha,Coffee Day Founder VG Siddhartha Missing,Coffee Day Founder VG Siddhartha,Mangaluru,Mango NewsTelugu

కేఫ్ కాఫీ డే (సిసిడి) వ్యవస్థాపకుడు వి.జి.సిద్ధార్థ అదృశ్యం కావడం ఇప్పుడు కర్ణాటకలో సంచలనం సృష్టిస్తుంది. జూలై 29 న సాయంత్రం మంగుళూరులోని నేత్రావతి వంతెనపై కారు దిగిపోయి, డ్రైవర్ ను అక్కడే ఆగమని చెప్పి నడుచుకుంటూ వెళ్లిన సిద్ధార్థ, ఆ తరువాత కనిపించకుండా పోయారు. డ్రైవర్ కంగారుగా కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు, కర్ణాటక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలు పెట్టారు, వంతెనపై నుండి నదిలోకి దూకి ఉంటారన్న అనుమానాలతో, నదిలో ఎంత గాలించినా సిద్ధార్థ ఆచూకీ తెలియరాలేదు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత బీజేపీ నాయకుడు ఎస్.ఎమ్ కృష్ణకు, సిద్ధార్థ అల్లుడు అవుతాడు. సమాచారం అందిన వెంటనే కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప, కాంగ్రెస్ నాయకుడు డీకే శివకుమార్ మరియు ఇతర నాయకులు ఎస్.ఎమ్ కృష్ణ నివాసానికి వెళ్లి కలుసుకున్నారు.

సిద్ధార్థ కనిపించకుండ పోవడానికి ఒక రోజు ముందు, బోర్డు డైరెక్టర్లకు మరియు కేఫ్ కాఫీ డే ఉద్యోగులకు ఒక లేఖ రాశాడు. 37 సంవత్సరాలలో 30 వేలమందికి ప్రత్యక్షముగా, 20 వేలమందికి పరోక్షంగా ఉద్యోగాలు కల్పించాను. కానీ ఇప్పుడు లాభదాయకమైన వ్యాపారం చేయడంలో విఫలమవుతున్నాను, నాపై నమ్మకం ఉంచిన ప్రజలందరినీ నిరాశపరిచినందుకు చాలా క్షమించండి. నేను చాలా కాలం పోరాడాను, ఇక పోరాడే ఓపికలేదు, ఒక ప్రైవేట్ ఈక్విటీలోని భాగస్వాముల షేర్లను బైబ్యాక్ చేయమని నాపై ఒత్తిడి పెడుతున్నారు,ఇక ఆ ఒత్తిడిని నేను తీసుకోవాలనుకోవట్లేదని తెలిపారు. కొత్త బాగస్వామ్యులతో మీరంతా ఇలాగే ఉండి వ్యాపారాన్ని కొనసాగించాలని కోరుకున్నారు, తానొక విఫల వ్యాపారవేత్తను అని, తనను క్షమించాలని లేఖలో కోరారు. వి.జి.సిద్ధార్థ కోసం కర్ణాటక పోలీసులు గాలిస్తున్నారు, గజ ఈతగాళ్లతో కలిసి నేత్రావతి నదిలో వెతుకుతున్నారు.

 

[subscribe]
[youtube_video videoid=QDwNym72hkk]

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 1 =