అమలులోకి మరో మూడు గ్యారెంటీలు

CM's meeting at Indravelli,Three more guarantees,Revanth Reddy, Congress, BRS, Bjp, Kcr, K Chandrasekhar Rao, public meeting at Indravelli, Revanth Reddy News And Live Updates, Telangna Congress Party, Telangna BJP Party, Mango News Telugu, Mango News, Telangana News Today In Telugu
CM's meeting at Indravelli,Three more guarantees,Revanth Reddy, Congress, BRS, Bjp, Kcr

ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లిలో ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇది  రేవంత్ రెడ్డి  మొదటి జిల్లా పర్యటన . ఈ ఇంద్రవెల్లి సభలోనే రేవంత్ రెడ్డి మూడు గ్యారెంటీలను ప్రకటించనున్నారు.ఇందిరమ్మ ఇళ్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500​​కే సిలిండర్ పథకాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించనున్నారు.  ఈ మూడు పథకాల జాబితాను ఇప్పటికే  అధికారులు ఇప్పటికే సిద్ధం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో 200 యూనిట్లు వాడే కుటుంబాలు 90 లక్షలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

మరోవైపు  ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇంద్రవెల్లిని సెంటిమెంట్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది. అప్పట్లో టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి నియామకం  జరిగిన తర్వాత 2021 ఆగస్టు 9న ఇంద్రవెల్లిలోనే  మొదటి సభ నిర్వహించారు. అప్పుడు ‘దళిత, గిరిజన దండోరా’ పేరుతో నిర్వహించిన సభకు లక్షమందికి పైగా వచ్చారు.అప్పటి సభ గ్రాండ్‌ సక్సెస్‌ అవడంతో.. అప్పటి నుంచీ రేవంత్‌ రెడ్డి ఇక వెనుదిరిగి చూడలేదు.

అదే ఊపుతో ఆ తర్వాత తెలంగాణలో ఎన్నో సభలు నిర్వహించారు. అప్పటి నుంచే కాంగ్రెస్‌పై ప్రజల్లో నమ్మకం పెరిగిందన్న అభిప్రాయం, నమ్మకం  పార్టీలో బాగా ఎక్కువయింది . దానికి ఊతమిచ్చినట్లుగానే ఈ సారి జరిగిన అసెంబ్లీ  ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం, రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి కావడం జరిగిపోయాయి. అదే సెంటిమెంటుతో తాజాగా పార్లమెంట్‌ ఎన్నికల నగారాను కూడా.. ఇంద్రవెల్లి  నుంచే మొదలుపెట్టడానికి రేవంత్‌ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు.

ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా, శాసనసభ ఎన్నికల్లో 4 బీజేపీ, 2 బీఆర్‌ఎస్‌ గెలువగా, మిగిలిన ఒకటి ఖానాపూర్‌ నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థి వెడ్మ బొజ్జు.. ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అయినా కూడా సీఎం  రేవంత్‌ రెడ్డి ఈ పార్లమెంట్‌ నియోజకవర్గాన్నే సవాల్‌గా తీసుకొని సెంటిమెంట్‌ను కొనసాగిస్తున్నారు. దీంతో  పార్లమెంట్‌ ఎన్నికల్లో పోటీ రసవత్తరంగా మారనుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 + sixteen =