వ్యాయామాలపై పరిశోధనలు- షాకింగ్‌​ విషయాలు

Better results with less exercise,Better results with exercise,Results with less exercise,Mango News,Mango News Telugu, Research on Exercise,less exercise, ten thousand steps to obesity, chronic diseases, little exercise,Research on Exercise News Today,Exercise Can Bring Better Results,Better Exercise is Better,Benefits of regular physical activity,Less exercise results Latest News
Better results with less exercise, Research on Exercise,less exercise, ten thousand steps to obesity, chronic diseases, little exercise

చాలామంది ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉండటానికి వర్కౌట్‌లు చేస్తుంటారు. మరికొంతమంది వేగంగా బరువు తగ్గడానికి , లేదా తాము అనుకున్న రిజల్ట్ రావడానికి వేగంగా వర్కౌట్‌లు చేస్తూ ఉంటారు. దీని కోసం ప్రతీ రోజూ 10 కిలోమీటర్లు వాకింగ్‌ చేయడం,  కొన్ని రకాల వ్యాయమాలు ఎక్కువ సమయం చేయడం చేస్తుంటారు.  ఐతే వ్యాయామాలపై చేసిన  తాజా పరిశోధనలో..  షాకింగ్‌ విషయాలు వెల్లడయ్యాయి. ఈ పరిశోధనల ప్రకారం మితంగా వ్యాయామం చేస్తే చాలట. మొన్నటి వరకు ఒబిసిటీకి  పదివేల అడుగులు వేయాలని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడు అన్ని అడుగులు అవసరం లేదని అధ్యయనంలో వెల్లడైంది. తక్కువ వ్యాయామంతో దీర్ఘకాలిక వ్యాధులకు చెక్‌పెట్టగలమని పరిశోధనలలో తేలింది.

స్పెయిన్‌లోని గ్రెనడా విశ్వవిద్యాలయంలోని పరిశోధకులు నిర్వహించిన అధ్యయనం ప్రకారం..తక్కువ వ్యాయామంతోనే మంచి ఫలితాలను పొందొచ్చని  పరిశోధనలో తేలింది. వివిధ రకాల వ్యాధులు వచ్చే ప్రమాదం సుమారు 60 శాతం తగ్గుతుందని కూడా వెల్లడైంది. దీంతో పరిశోధకులు ఈ విషయాలను అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ జర్నల్‌లో  వెల్లడించారు. దీనికోసం సుమారు లక్ష​ మందికి పైగా వ్యక్తులపై పరిశోధనలు చేసినట్లు చెప్పారు. ఆరోగ్యంగా ఉండటానికి, బరువు తగ్గడానికి ప్రతి రోజూ పదివేల అడుగులు అవసరమని ఇప్పటి వరకూ నిపుణులు చెబుతూ వచ్చారు. కానీ అన్ని  అడుగులు అవసరం లేదని తాజా పరిశోధనలు చెప్పడంతో ఇది బరువు తగ్గాలనుకునేవారికి, వ్యాయామాలు చేయడానికి తగిన సమయం లేదనుకునేవాళ్లకు ఇది శుభవార్తగానే చెప్పొచ్చు.

కేవలం రెండు కిలోమీటర్లు అంటే సుమారు 2,700 అడుగులు నడిస్తే చాలట.. వివిధ గుండె సంబంధిత సమస్యలు కూడా తగ్గుతాయని చెబుతున్నారు. అలా అని ఎక్కువ దూరం నడిచేవాళ్లను మానేయమని చెప్పడం కాదు.. అలా  నడిచే వారిలో కూడా చాలా మంచి ప్రయోజనాలు కూడా కనిపించాయి. అయితే తప్పనిసరిగా పదివేల అడుగులు నడవడం అక్కర లేదని మాత్రమే తాజా పరిశోధనలు చెబుతున్నాయి.  రోజుకు రెండు కిలోమీటర్లు నడవడంతో పాటు..మంచి తృణ ధాన్యాలతో కూడిన సమతుల్య ఆహారం తీసుకుంటే చాలని.. చాలా రుగ్మతలు నుంచి సులభంగా బయటపడతారని పరిశోధకులు అంటున్నారు.

అంతేకాదు.. మగవాళ్లకు, ఆడవాళ్లకు వ్యాయామాలు చేసే విషయంలో ఎంత సేపు చేయాలనేది వారి  ఇష్టం, సమయం బట్టే ఉంటుంది తప్ప వ్యాయామాలు చేయడంలో ఏం తేడాలుండవని పరిశోధకులు చెబుతున్నారు.  తక్కువగా చేసినా కూడా మంచి ఫలితాలను పొందొచ్చని  భరోసా ఇస్తున్నారు.అలాగే  ఎక్కువ సేపు వ్యాయామం  చేసేవారికి ఆరోగ్యం మరింత మెరుగ్గా ఉంటుందని..అంతేకాదు  మరిన్ని ఎక్కువ ఉపయోగాలు ఉంటాయని అంటున్నారు.

నిజానికి  ఈ పదివేల అడుగులు నడవడం అనే కాన్సెప్ట్.. జపాన్ దేశం నుంచి టోక్యో ఒలంపిక్స్‌  సమయంలో వచ్చిందట. ఆటగాళ్లంతా మెరుగ్గా ఆడేలా ఫిట్‌నెస్‌పై ఎక్కువ దృష్టి పెట్టడానికి జపాన్‌  పదివేల అడుగుల లక్ష్యాన్ని నిర్దేశించిందట. అయితే ఆ పదివేల అడుగుల కాన్సెస్ట్ సైన్సు పరంగా ఎక్కడా కూడా ఫ్రూవ్‌ కాలేదు. కేవలం ఈ సంఖ్యను అంతా గుర్తుంచుకోవడానికి సులభంగా ఉంటుందని ఇలా టార్గెట్ పెట్టినట్లు పరిశోధకకుల తెలిపారు.

అందువల్ల ప్రతీరోజూ వ్యాయామం చేయడం ముఖ్యమని ..అది తక్కువ సమయమా, ఎక్కువ సమయమా అన్నది కాదని.. దాదాపు  రెండు కిలోమీటర్లు నడిచినా  కూడా పూర్తి ఫిట్‌నెస్‌గా ఉండగలమని పరిశోధనలు తేల్చి చెప్పాయి.  దీంతోపాటు సమయానకి తినడం, కంటి నిండా నిద్రపోవడం వంటివి చేస్తే జీర్ణ వ్యవస్థ బాగుంటుందని పరిశోధకులు చెబుతున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nine − 5 =