క్రికెట్ అభిమానులకు పండుగే

A festival for cricket fans Team India is entering WhatsApp,A festival for cricket fans,cricket fans Team India,Team India is entering WhatsApp,cricket fans Team entering WhatsApp,Mango News,Mango News Telugu,What is WhatsApp Channel,ICC World Cup Team India Jersey ,How to Follow Indian Cricket Team in WhatsApp, cricket fans,Team India WhatsApp,cricket fans Team India News Today,cricket fans Team India Latest News,cricket fans Team India Latest Updates

ఇండియాలో ఏ గేమ్‌కు లేనంత క్రేజ్, ఫాలోయింగ్ ఒక్క క్రికెట్​‌‌కే ఉంటుంది. అమెరికా , యూకే వంటి దేశాలలో క్రికెట్‌ను అస్సలు పట్టించుకోకపోయినా ఇండియాలో మాత్రం క్రికెట్ అంటే ప్రాణాలు ఇచ్చేస్తారు. మ్యాచ్ వస్తుందంటే చాలు ఆ పూట అన్ని పనులు పక్కన పెట్టేసి టీవీలకు అతుక్కుపోతారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఆఫీసులకో, ఇంపార్టెంట్ పనులకో వెళ్లాల్సి వస్తే.. తప్పనిసరిగా మొబైల్‌లో క్రికెట్ లైవ్ అప్ డేట్స్ చూడటమో..ఎవరికైనా ఫోన్ చేసి స్కోర్ అడగటమో చేస్తుంటారు.

అంతేకాదు అసలు మామూలు సమయాల్లో ఆటగాళ్లు ఏం చేస్తుంటారు.. ఏ మ్యాచ్ కోసం ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తుంటారు. వీటితో పాటు క్రికెటర్ల అప్ డేట్స్, ఎక్స్ క్లూజివ్‌ ఫోటోలు చూడటానికి తెగ ఇంట్రస్ట్ చూపిస్తుంటారు. టీమ్ గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడంతో పాటు.. తెర వెనుక ఏం జరుగుతోందన్న విషయాలను ఈజీగా తెలుసుకోవచ్చు. ఎలా అంటే ఇప్పుడు టీమిండియా .. వాట్సాప్ ఛానెల్స్‌లోకి వచ్చింది. అయితే ఈ వాట్సాప్ ఛానెల్‌తో.. టీమిండియా న్యూస్ తెలుసుకునే అవకాశం ఉంటుంది తప్ప టీమ్ సభ్యులతో చాట్ చేసే అవకాశం మాత్రం ఉండదని క్రికెట్ అభిమానులు గుర్తుంచుకోవాలి.

ఇన్ని రోజులు వాట్సప్‌ను కేవలం కమ్యూనికేషన్‌ కోసం మాత్రమే వాడేవాళ్లం. ఆ తర్వాత గ్రూప్స్‌ ..ఇప్పుడు ఏకంగా ఛానెల్స్‌ రెడీ అయిపోయాయి.ఇలాంటి ఫీచర్‌ ద్వారా మీకు నచ్చిన వ్యక్తులు, సంస్థలను ఫాలో అవ్వొచ్చు.. వాట్సాప్‌లోనే ఎప్పటికప్పుడు వారి అప్‌డేట్స్‌ తెలుసుకోవచ్చు. అచ్చంగా ఎక్స్ ఫ్లాట్ ఫామ్, ఇన్‌స్టాగ్రామ్‌లో ఎలాగైతే మనకు నచ్చిన వారిని ఫాలో అవుతున్నామో అలా వాట్సాప్ చానెల్‌లో కూడా చేయొచ్చన్నమాట. అయితే మీరు ఫాలో అయినా కూడా మీ ఫోన్‌ నంబర్‌ ఎవరికీ కనిపించదు.

తాజగా ఇలాగే వాట్సాప్‌లోకి టీమిండియా ఎంటర్ అవడంతో క్రికెట్ ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు. ఇప్పటికే సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ అయిన ఎక్స్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ లలో ఇండియన్ టీమ్ ఉంది. ఇప్పుడు వాట్సాప్ ఛానెల్ ద్వారా ఇండియన్ క్రికెట్ టీమ్ అభిమానులకు మరింత చేరువ అవడం గ్యారంటీ అని చెప్పొచ్చు. ఈ ఛానెల్​‌ను ఫాలో అయ్యే క్రికెట్ అభిమానులు ఎప్పటికప్పుడు టీమ్‌కు సంబంధించిన న్యూస్‌ను తెలుసుకోవచ్చు. నేరుగా వాళ్ల ఫోన్​‌కే తమ క్రెకెట్ హీరోల సమాచారం తెలుసుకోవడానికి అభిమానులు వెయిట్ చేస్తున్నారు. వరల్డ్ కప్​ కంటే ముందు ఇండియన్ టీమ్. ఫ్యాన్స్‌కు ఈ వాట్సాప్ ఛానెల్స్ ద్వారా గుడ్ న్యూస్ అందించాయంటూ ఎగిరి గంతేస్తున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × two =