హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి ఖరారు, గెల్లు శ్రీనివాస్ యాదవ్ నేపథ్యం ఇదే…

CM KCR Announced Gellu Srinivas Yadav as TRS Candidate For Huzurabad, CM KCR Announced Gellu Srinivas Yadav as TRS Candidate For Huzurabad By-elections, Gellu Srinivas Yadav as TRS Candidate, Gellu Srinivas Yadav as TRS Candidate For Huzurabad By-elections, Huzurabad by poll, Huzurabad By-elections, Huzurabad bypoll 2021, Huzurabad bypolls, KCR Announced Gellu Srinivas Yadav as TRS Candidate, Mango News, TRS Candidate For Huzurabad By Boll, TRS Candidate For Huzurabad By-elections

హుజూరాబాద్ నియోజకవర్గానికి జరగనున్న ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ పేరును టీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. గెల్లు శ్రీనివాస్ యాదవ్ తెలంగాణ ఉద్యమంలో విద్యార్థి నాయకుడుగా, టీఆర్ఎస్వీ ప్రస్థుత విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడుగా పనిచేస్తున్నారు. గెల్లు శ్రీనివాస్ యాదవ్ టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచే పార్టీలో అంకితభావంతో ధీక్షతో పనిచేస్తున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ టీఆర్ఎస్వీ విభాగం అధ్యక్షుడుగా పనిచేసిన గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఉద్యమ కాలంలో అరెస్టులయ్యి పలుమార్లు జైలుకెళ్లారు. గెల్లు శ్రీనివాస్ క్రమశిక్షణతో కూడిన వ్యక్తిత్వాన్ని, సేవాభావాన్ని, నిబద్దతను గుర్తించిన సీఎం కేసీఆర్ ఆయన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు.

గెల్లు శ్రీనివాస్ యాద‌వ్ నేప‌థ్యం:

గెల్లు శ్రీనివాస్ యాదవ్ క‌రీంన‌గ‌ర్ జిల్లా వీణ‌వంక మండ‌లం హిమ్మ‌త్ న‌గ‌ర్ గ్రామంలో గెల్లు మ‌ల్ల‌య్య‌, ల‌క్ష్మీ దంప‌తుల‌కు ఆగ‌స్టు 21, 1983న జ‌న్మించారు. ఆయన విద్యార్హతలు ఎంఏ, ఎల్ఎల్ బి, పరిశోధక విద్యార్థి (రాజనీతి శాస్త్రం). బీసీ (యాదవ్) సామాజిక వర్గానికి చెందిన గెల్లు శ్రీనివాస్ యాద‌వ్ డిగ్రీ (బి.ఏ)చదువుతున్న కాలం నుంచే విద్యార్థి రాజకీయాలలో చురుకుగా పాల్గొన్నారు. హైదరాబాద్ లోని అంబర్ పేట్ లోని ప్రభుత్వ బిసి హాస్టల్ లో ఉంటూ అధ్యక్షుడు (2003-2006)గా ఎన్నికై బీసీ విద్యార్థుల సమస్యలపై పోరాడారు. ఏవీ కాలేజీలో డిగ్రీ చదువుతున్న రోజుల్లో ఉద్యమనాయకుడిగా కేసీఆర్ నేతృత్వంలో జరుగుతున్న తెలంగాణ ఉద్యమానికి, కేసీఆర్ ప్రసంగాలకు ఆకర్షితుడై క్రియాశీలకంగా ఉద్యమ కాలంనుండి నేటి వరకు అదే ఉత్సాహంగా టీఆర్ఎస్ పార్టీ లో నిబద్ధతతో పనిచేశారు.

2003-2006 టీఆర్ఎస్వీ అధ్యక్షులు, ఏవీ కాలేజీ, హైదరాబాద్ గా ఉన్నప్పుడు విద్యార్థుల ఫీజు పెంపు నిర్ణయానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున విద్యార్థి ఉద్యమాన్ని నడిపి అరెస్ట్ అయ్యారు.చివరకు కాలేజ్ యాజమాన్యం ద్వారా ఫీజు రియంబర్స్మెంట్ సాధించడంలో విజయం సాదించారు. 2003-2006 లో టీఆర్ఎస్వీ హైదరాబాద్ పట్టణ కార్యదర్శిగా బొమ్మర రామ్మూర్తి మరియు బాబా ఫసియుద్దీన్ నాయకత్వం లో పనిచేశారు. 2003-2004 విద్య సంవత్సరంలో బీసీ విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ కోసం ఇందిరా పార్కులో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ధర్నా లు నిర్వహించారు. 2004 డిసెంబర్ లో విద్యార్థుల స్కాలర్ షిప్ మరియు ఫీజు రియంబర్స్మెంట్ మోతాన్నిపెంచాలని ఆర్థిక మంత్రి రోశయ్య ఇళ్ళు ముట్టడికి ధర్నా నిర్వహించి అరెస్టు అయ్యారు. 2006-2007 లో హైదరాబాద్ లోని తెలుగు యూనివర్సిటీ, టీఆర్ఎస్వీఅధ్యక్షుడుగా, టీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు బొంతు రామ్మోహన్ నాయకత్వం లో నియమితులై పనిచేశారు. సెప్టెంబర్ 19, 2006 న సోమజి గూడ ప్రెస్ క్లబ్ లో లగడపాటి రాజగోపాల్ కు వ్యతిరేకంగా ఓయూ విద్యార్థులు జరిపిన నిరసన ర్యాలీ లో అరెస్ట్ అయ్యారు.

2006 లో కేసీఆర్ కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నందుకు మద్దతు గా భవన్స్ కాలేజీ విద్యార్థులతో నారాయణ గూడలో భారీ ఎత్తున ధర్నా నిర్వహించి కాంగ్రెస్ నాయకుల దిష్టిబొమ్మలను తగలపెట్టారు. 2006 సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గం, కరీంనగర్ లోక్ సభ ఉపఎన్నికలలో స్టూడెంట్ ఇంచార్జి గా హరీష్ రావు నాయకత్వం లో పనిచేశారు. 2008, స్టూడెంట్ ఇంచార్జిగా జడ్చేర్ల నియోజకవర్గ ఉపఎన్నికలో మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి రెడ్డి నాయకత్వం లో పని చేసారు. టీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి (2008)గా ఎర్రోళ్ళ శ్రీనివాస్ నాయకత్వంలో పనిచేశారు. 2009 సాధారణ ఎన్నికల్లో హుజురాబాద్ నియోజకవర్గంలో ఈటల రాజేందర్ నాయకత్వంలో క్రియాశీలకంగా పనిచేశారు. 2009 లో కేసీఆర్ అరెస్ట్ ను నిరసిస్తూ, పార్లమెంట్ లో తెలంగాణ బిల్లు ప్రవేశ పెట్టాలని ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులతో పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు. 2010లో ఉస్మానియా యూనివర్సిటీ టీఆర్ఎస్వీ అధ్యక్షుడు గా బాల్క సుమన్ ద్వారా నియమించబడ్డారు. జనవరి 18, 2010 న “తెలంగాణ విద్యార్థి మహా పాదయాత్ర” ప్రారంభించి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి కాకతీయ యూనివర్సిటీ ఉత్తర తెలంగాణ ప్రాంతానికి 650 కి.మీ. పాదయాత్ర చేసి వేల మంది విద్యార్థులను యువకులను పాదయాత్రలో, తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములను చేయడంలో విజయం సాధించారు.

2010 హుజురాబాద్ ఉపఎన్నిక లో స్టూడెంట్ ఇంచార్జిగా బస్సు యాత్ర (ప్రజా చైతన్య యాత్ర)లో పనిచేశారు. మార్చి 1, 2011న, మౌలాలి రైల్వే స్టేషన్లలో 48 గంటల రైల్ రొఖో ప్రోగ్రాంను వందలాది విద్యార్థులతో కలిసి కేటీఆర్ నాయకత్వంలో విజయవంతం చేశారు. మార్చి 10, 2011 న, టీఆర్ఎస్వీ ఉస్మానియా యూనివర్సిటీ అధ్యక్షుడుగా తెలంగాణ జెఏసి పిలుపు మేరకు చారిత్రక “మిలియన్ మార్చ్ ప్రోగ్రాం”లో భారీ ర్యాలీ నిర్వహించారు. జులై 21, 2011న యాదిరెడ్డి ఆత్మహత్యకు నిరసనగా బందుకు పిలుపునిచ్చి ఉస్మానియా యూనివర్సిటీ నుండి తెలంగాణ భవన్ కు భారీ ర్యాలీ నిర్వహించారు. సీసీఎస్ పోలీసులు అరెస్టు చేసి చంచల్ గూడ జైల్లో బంధించారు. నవంబర్ 1, 2011న ఆంద్రప్రదేశ్ అవతరణ దినోత్సవంను నిరసిస్తూ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ నుంచి గన్ పార్క్ వరుకు “చలో గన్ పార్క్” ప్రోగ్రాం కు వందలాది విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది. నవంబర్ 16-22, 2011 వరకు కేటీఆర్ నాయకత్వంలో జరిగిన “వికారాబాద్ -కుత్బుల్లాపూర్ చౌరస్తా పాదయాత్ర”లో పాల్గొన్నారు. మార్చి 2012లో స్టూడెంట్ ఇంచార్జిగా కొప్పుల ఈశ్వర్ ఎమ్మెల్యే నాయకత్వంలో కొల్లాపూర్ ఉపఎన్నికలో జూపల్లి కృష్ణారావు గెలుపుకై పని చేసారు. సెప్టెంబర్ 30, 2012న కేటీఆర్ నాయకత్వం లో ‘సాగర హారం ప్రోగ్రాం’ కు వందలాది ఉస్మానియా విద్యార్థులతో మహా ర్యాలీ నిర్వహించారు. 14F క్లాజ్ ను తొలగించాలని ఉస్మానియా యూనివర్సిటీలో ర్యాలీ నిర్వహించి నిరసన వ్యక్తం చేసారు.

2012లో ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ నుండి సెక్రటేరియట్ వరకు “చలో సెక్రటేరియట్” ప్రోగ్రాంతో భారీ ర్యాలీ నిర్వహించి తెలంగాణ ఎంప్లాయిస్ “సకలజనుల సమ్మెకు” మద్దతుగా నిర్వహించారు.సెప్టెంబర్ 7, 2013న, ఏపీ ఎన్జీవోస్ తలపెట్టిన “సేవ్ ఆంద్రప్రదేశ్” మీటింగ్ ను వ్యతిరేకిస్తూ ఎల్బీ స్టేడియం వద్ద అరెస్టు అయ్యారు. అనేక మంది విద్యార్థుల సామాజిక ఆర్థిక వ్యక్తిగత సమస్యల పట్ల యూజీసీ మరియు జాతీయ కమీటీలకు రిప్రెజెంటేషన్ ఇచ్చారు. 2013 డిసెంబర్ లో హైదరాబాద్ లోని ఎన్సీఆర్ మానవ వనరుల మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వంలో ఫుల్ టైం చైర్మన్ మరియు పోస్టులను భర్తీ చేయాలని కోరుతూ హైకోర్టు లో పిల్ వేశారు. ఫలితంగా ఏపీ హైకోర్టు, మానవ వనరుల మంత్రిత్వ శాఖ సెక్రెటరీని హైకోర్టు లో హాజరు కావాలని ఆర్డర్ చేయడం జరిగింది. 2001 నుండి నేటి వరకు తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. 100కు పైగా కేసులు నమోదయ్యాయి. అనేక సార్లు పోలీసులు అరెస్టు చేశారు మరియు 2 సార్లు జైలుకు వెళ్లి 36 రోజులు చర్లపల్లి సెంట్రల్ జైల్ మరియు చంచల్ గూడ సెంట్రల్ జైల్ లో జైలు జీవితం గడిపారు. 2017 నుండి టీఆర్ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా సీఎం కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తున్నారు.

గెల్లు శ్రీనివాస్ యాదవ్ కుటుంబ నేపథ్యం:

గెల్లు శ్రీనివాస్ యాదవ్ తండ్రి గెల్లు మల్లయ్య స్థానిక మండల స్థాయిలో 1985 నుంచి టీడీపీలో చాలా చురుకైన పాత్ర పోషించారు. గెల్లు మల్లయ్య అఖిల భారత యాదవ మహాసభ కన్వీనర్ (2000-2005)గా, కొండపాక ఎంపీటీసీ (2001-2005)గా టీఆర్ఎస్ పార్టీ మండల ఉపాధ్యక్షులుగా పనిచేశారు. టీఆర్ఎస్ పార్టీ లో మండల స్థాయిలో 2004 నుండి నేటి వరకు పనిచేస్తున్నారు. జిల్లా యాదవ సహకార సంస్థ డైరెక్టర్, (పశుసంవర్థక శాఖ, ఆంధ్రప్రదేశ్) గా ఎన్నుకోబడ్డారు. ప్రస్తుతం పీఏసీఎస్ డైరెక్టర్ గా మరియు రైతు బంధు సమితి కోఆర్డినేటర్ (కొండపాక)గా పనిచేస్తన్నారు. గెల్లు శ్రీనివాస్ యాదవ్ తల్లి హిమ్మత్ నగర్ గ్రామ సర్పంచ్ (టీఆర్ఎస్ పార్టీ) గా సేవలందించారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × 2 =