తెలంగాణ కేబినెట్ : 50 వేల వరకున్న రైతుల రుణాలను మాఫీ చేయాలని నిర్ణయం

Crop Loan Waiver For Farmers, Dalit Bandhu scheme, Government Permits Crop Loan Waiver For Farmers, Highlights of Telangana Cabinet Meeting, Mango News, Telangana Cabinet Key Decisions, Telangana Cabinet Meet, Telangana Cabinet meeting, Telangana Cabinet Meeting 2020, Telangana Cabinet Meeting Highlights, Telangana Cabinet Meeting In Pragathi Bhavan, Telangana Cabinet Meeting News, Telangana Cabinet Meeting updates, TRS Government Permits Crop Loan Waiver For Farmers

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ఆదివారం నాడు ప్రగతి భవన్ లో జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు, రాష్ట్రంలో ఇప్పటి వరకు 25 వేలలోపు రుణాలను మాఫీ చేసిన ప్రభుత్వం, కరోనా కారణంగా నిలిచిపోయిన రుణమాఫీని కొనసాగిస్తూ 50 వేల వరకున్న రుణాలను మాఫీ చేయాలని తాజాగా నిర్ణయించింది. అందుకు ఆగస్టు 15 నుంచి నెలాఖరు వరకు రుణ మాఫీ ప్రక్రియను కొనసాగించాలని అధికారులను ఆదేశించింది.

6 లక్షల మంది రైతులకు లబ్ధి:

ఈ సందర్భంగా రాష్ట్రంలో ఇప్పటి వరకు పంటరుణ మాఫీకి సంబంధించిన వివరాలను ఆర్థిక శాఖ కేబినెట్ ముందుంచింది. తద్వారా 6 లక్షల మంది రైతులు లబ్ధి పొందనున్నారు. 25 వేల రుణమాఫీతో ఇప్పటికే 3 లక్షల పైచిలుకు రైతులు ప్రయోజనం పొందారు. దీంతో ఇప్పటివరకు రుణమాఫీ ద్వారా ప్రయోజనం పొందిన రైతుల సంఖ్య 9 లక్షలకు చేరనున్నది. మిగతా రుణమాఫీ ప్రక్రియ కూడా దశలవారీగా కొనసాగుతుందని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × one =