రాష్ట్రంలో 48 ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లను ఏర్పాటు చేయాలి: సీఎం కేసీఆర్

CM KCR Orders to Set up 324 Metric Ton Oxygen Plants at 48 Govt Hospitals,Mango News,Mango News Telugu,Oxygen Plants At 48 Government Hospitals,Covid-19 Telangana,Telangana To Set Up 48 Oxygen,Telangana To Set Up 48 Oxygen Generation Plants,Cm K Chandrasekhar Rao Orders Oxygen Production Units At 48,KCR Instructs Officials To Set Up 48 Oxygen Generation Plants,Telangana To Set Up 48 Oxygen Generation Plants,Oxygen Crisis,KCR Orders Setting Up 48 Gas Plants In Government Hospitals,Oxygen,Oxygen In Telangana,KCR Tells Covid Patients To Move To Govt Hospitals,Telangana CM,CM KCR,Telangana CM KCR,Telangana News,CM KCR Live,Telangana State,CM KCR Live Updates,CM KCR Latest,CM KCR Latest News,CM KCR Latest Updates,CM KCR Speech,CM KCR Live Pressmeet,CM KCR Pressmeet,CM KCR Pressmeet Live,KCR,Telangana News

తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్ రోగులకు అవసరమైన 324 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లను 48 ప్రభుత్వ ఆస్పత్రులలో ఏర్పాటు చేసి భవిష్యత్ లో కూడా ఎలాంటి ఆక్సిజన్ కొరత రాకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వైద్య ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. అదనంగా ఇంకా 100 మెట్రిక్ టన్నుల లిక్విడ్ ఆక్సిజన్ ఉత్పత్తి చేసే ప్లాంటును కూడా హైదరాబాద్ లో ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. 16 మెట్రిక్ టన్నుల ప్లాంట్లు 6 యూనిట్లు, 8 మెట్రిక్ టన్నుల ప్లాంట్లు 15 యూనిట్లు, 4 మెట్రిక్ టన్నుల ప్లాంట్లు 27 యూనిట్లు హైదరాబాద్ లో, జిల్లా, ఏరియా ఆస్పత్రుల్లో ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఒక్కొక్కటి 20 టన్నుల కెపాసిటీ గల 11 ఆక్సిజన్ ట్యాంకర్లను 10 రోజుల్లోగా అందించాలని ఉత్పత్తిదారులను సీఎం కోరారు. ఆక్సిజన్ సరఫరా విషయంలో రాబోయే రోజుల్లో ఇతర రాష్ట్రాల మీద ఆధారపడే పరిస్థితి ఉండొద్దని సీఎం అన్నారు. సోమవారం నాడు ప్రగతి భవన్ లో కరోనా పరిస్థితులపై సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం జరిపారు.

కరోనా చికిత్సకు ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే చేరండి, ప్రైవేటుకు వెళ్లి డబ్బులు పోగొట్టుకోవద్దు:

కరోనా వైద్యం విషయంలో తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వరంగంలో పూర్తిగా ఉచిత వైద్యం, భోజన వసతి, మందులు తదితర సకల సౌకర్యాలు కల్పిస్తున్నందున పేద ప్రజలు ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే చేరాలని సీఎం కోరారు. సోమవారం నాటికి ప్రభుత్వ ఆస్పత్రుల్లో మొత్తం 6,926 బెడ్లు ఖాళీగా ఉన్నాయని, అందులో ఆక్సిజన్ బెడ్స్ 2,253, ఐసీయూ 533, జనరల్ బెడ్స్ 4,140 ఖాళీ ఉన్నాయని సీఎం వివరించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో బెడ్స్, ఆక్సిజన్, రెమిడెసివిర్ మందులు సహా అన్నీ అందుబాటులోనే ఉన్నందున ప్రైవేటు హాస్పిటల్స్ ను ఆశ్రయించి, డబ్బులు పోగొట్టుకోవద్దని సీఎం కేసీఆర్ ప్రజలకు సూచించారు. వైద్యం ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలో ఎక్కడైనా ఒక్కటే అయినందున కరోనా చికిత్సకు ప్రజలు ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే చేరాలని సీఎం ప్రజలను కోరారు.

బ్లాక్ ఫంగస్ వ్యాధి చికిత్సకు కోఠిలోని ఈ.ఎన్.టి, సికింద్రాబాద్ లోని గాంధీ ఆస్పత్రుల్లో చికిత్స:

కరోనా రోగులకు తర్వాతి దశలో బ్లాక్ ఫంగస్ అనే వ్యాధి సోకుతున్నదని, దానికి సంబంధించి చికిత్స అందించడం కోసం కోఠిలోని ఈ.ఎన్.టి, సికింద్రాబాద్ లోని గాంధీ ఆస్పత్రుల్లో, జిల్లాలోని మెడికల్ కాలేజీ ఆస్పత్రుల్లో ఎక్విప్ మెంట్, అవసరమైన మందులు సమకూర్చాలని సీఎం అధికారులను కోరారు. ఇందుకు అవసరమైన 25 మైక్రో డీబ్రైడర్ మిషన్లు, హెచ్.డి.ఎండోస్కోపిక్ కెమెరాలను తక్షణమే తెప్పించాలని సీఎం ఆదేశించారు. కరోనా వ్యాక్సిన్ల సరఫరా కోసం గ్లోబల్ టెండర్లను పిలవాలని సీఎం అధికారులకు సూచించారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావలసిన వ్యాక్సినేషన్ కోటా విషయంలో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ తెప్పించుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఇప్పటివరకు కేంద్రం నుంచి తెలంగాణకు 57,30,220 డోసుల వ్యాక్సిన్ మాత్రమే వచ్చిందని, కోవాక్సిన్, కోవిషీల్డ్ కలిపి ప్రస్తుతం 1,86,780 డోసులు స్టాకు ఉందని అధికారులు సీఎం కు తెలిపారు. అందులో కోవాక్సిన్ 58,230, మరియు కోవిషీల్డ్ 1,28,550 డోసులు స్టాకు ఉందని సీఎంకి వివరించారు.

ఈ సమీక్ష సమావేశంలో మంత్రి హరీశ్ రావు, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి ఎస్.ఏ.ఎం రిజ్వీ, సీఎం సెక్రటరీ, సీఎంఓ కోవిడ్ ప్రత్యేక అధికారి రాజశేఖర్ రెడ్డి, ఐఏఎస్ అధికారులు సర్పరాజ్ అహ్మద్, రోనాల్డ్ రాస్, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు, డీఎంఈ కె.రమేశ్ రెడ్డి, కాళోజీ హెల్త్ యూనివర్సిటీ వీసీ కరుణాకర్ రెడ్డి, టీఎస్ఎంఎస్ఐడీసీ ఎం.డీ.చంద్రశేఖర్ రెడ్డి, సీఎం ఓఎస్డీ (హెల్త్) గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × four =