తెలంగాణలో ఇంటర్ డిజిటల్‌ తరగతుల నిర్వహణ వాయిదా

Digital Classes for Intermediate Students, Digital Classes for Intermediate Students Postponed, Intermediate Digital Classes Postponed, Telangana Digital Classes, Telangana Intermediate Digital Classes, Telangana Intermediate Digital Classes News, Telangana Intermediate Digital Classes Postponed

తెలంగాణ రాష్ట్రంలోని ఇంట‌ర్మీడియ‌ట్ విద్యార్థులకు ఆగస్టు 17 నుంచి డిజిటల్ త‌ర‌గ‌తులు ప్రారంభించాలని ఇటీవలే ఇంటర్ బోర్డు నిర్ణయించిన సంగతి తెలిసిందే. ప్ర‌భుత్వ, ఎయిడెడ్ క‌ళాశాల‌ల విద్యార్థుల‌కు డీడీ యాద‌గిరి, టీశాట్ ద్వారా డిజిటల్ త‌ర‌గ‌తులు నిర్వ‌హించేలా ఏర్పాట్లు చేశారు. అయితే ఇంటర్ విద్యార్థులకు‌ డిజిటల్ తరగతులను వాయిదా వేస్తున్నట్లు తాజాగా ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపధ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఆగస్టు 20 లోగా విద్యార్థులకు డిజిటల్‌ తరగతుల ఎప్పటి నుంచి ప్రారంభిస్తారనే విషయంతో పాటుగా కాలేజీలకు లెక్చరర్లు, సిబ్బంది హాజరుకావడంపై కూడా కీలక ప్రకటన చేసే అవకాశమునట్టు సమాచారం.

మరోవైపు ఆగస్టు 20వ తేదీ నుంచి పాఠశాల విద్యార్థులకు కూడా డిజిటల్ తరగతులు నిర్వహించాలని ముందుగా భావించారు. ఆగస్టు 20 నుంచి 6 నుండి 10 వ తరగతి వరకు, సెప్టెంబర్ 1 వ తేదీ నుంచి 3 నుండి 5 తరగతి విద్యార్థులకు డిజిటల్ తరగతులు నిర్వహించాలని నిర్ణయించారు. అయితే డిజిటల్ త‌ర‌గ‌తులు వాయిదా పడడంతో పాఠశాల విద్యార్థులకు కూడా డిజిటల్ తరగతుల నిర్వహణపై త్వరలోనే విద్యాశాఖ స్పష్టత ఇవ్వనుంది.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 2 =