ఓటర్లు నాడిని కరెక్టుగా పట్టుకున్న హస్తం

Are these the reasons for Congresss victory,Are these the reasons,Reasons for Congresss victory,Congresss victory,Congress Success Reasons, TS Elections 2023, Congress victory KCR,Congress, Brs , Congress victory, defeat of KCR, votes,Telangana Assembly polls,Congress Telangana Win,Mango News,Mango News Telugu,Congress victory Latest News,Congress victory Latest Updates,Telangana Elections 2023,Telangana Elections Latest News,Telangana Elections Latest Updates
Congress Success Reasons, TS Elections 2023, Congress's victory? KCR,Congress, Brs , Congress victory, defeat of KCR, votes,

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో రాజకీయ విశ్లేషకులు సైతం ఆశ్చర్యపడేలా  కాంగ్రెస్‌ విజయం సాధించింది. అయితే టఫ్ ఫైట్ ఇస్తుంది లేదంటే హంగ్‌ ఏర్పడుతుందన్న లెక్కలను.. అమాంతం కిందకు నెట్టేసి విక్టరీని సొంతం చేసుకుంది. దీంతో బీఆర్ఎస్ నేతలు తమ ఓటమికి కారణాలు వెతుక్కుంటుంటే.. రాజకీయ విశ్లేషకులు కాంగ్రెస్‌కు విజయాన్ని సొంతం చేసిన అంశాలను పరిశీలిస్తున్నారు.

మొత్తం 65 స్థానాల్లో కాంగ్రెస్ గెలుపొందింది. బీఆర్ఎస్ 39 స్థానాల్లో, బీజేపీ 8 స్థానాల్లో, ఎంఐఎం 7 స్థానాల్లో విజయం సాధించాయి. ఎన్నికల్లో ఘన విజయం సాధించడంతో కాంగ్రెస్ నేతలు సంబురాల్లో మునిగి తేలుతున్నారు. కాంగ్రెస్ గ్రాండ్ విక్టరీతో అంచనాలకు మించిన స్థానాల్లో విజయకేతనం ఎగురువేసింది.  కారు పార్టీకి బ్రేకులు వేసి మరీ హస్తం పార్టీ దూసుకెళ్లడంపై సర్వత్రా చర్చలు జరుగుతున్నాయి.

నిజానికి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయానికి ..ఎన్నికలు ముందు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల హామీ బాగా పని చేసిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అంతేకాదు కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ఆరు నెలల ముందు నుంచే గ్రౌండ్ ప్రిపరేషన్ మొదలు పెట్టడమే కాకుండా.. దీని కార్యాచరణ పక్కాగా అమలు చేయడంలో హండ్రెడ్ పర్సంట్ సక్సెస్ అయింది. కేసీఆర్‌తో పాటు బీఆర్ఎస్ ప్రభుత్వంపై తెలంగాణ ప్రజలలో ఉన్న వ్యతిరేకతను.. తమకు అనుకూలంగా మార్చుకోవటంలో కాంగ్రెస్ పార్టీ నేతలంతా సక్సెస్ అయ్యారు.  దీంతో పాటు గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాల్లోని బీఆర్ఎస్ సంప్రాదాయక ఓటు బ్యాంక్‌ను కూడా తమవైపునకు తిప్పుకోగలగడంలో నేతలు సఫలీకృతులయ్యారు.

జనరల్‌గా తెలంగాణలో ఏ పార్టీ గెలుపు కోసం అయినా మైనార్టీల ఓట్లు చాలా కీలకం.ఈ పాయింట్‌ను కూడా కాంగ్రెస్ క్యాచ్ చేయడం ఆ పార్టీకి మరో ప్లస్‌గా మారింది. మైనార్టీ డిక్లరేషన్ ద్వారా మైనార్టీ వర్గాలకు మరింత దగ్గరయ్యే ప్రయత్నం చేసింది.దీంతో పాటుగా బీఆర్ఎస్, బీజేపీ,ఎంఐఎం ఒక్కేటే అన్న వాదనను ప్రజలలోకి బలంగా  తీసుకెళ్లడంతో కాంగ్రెస్ విజయం సాధించింది. వీటితో పాటు తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగులంతా.. తమను దారుణంగా మోసం చేసిందని భావించడం..ఇదే సమయంలో  కాంగ్రెస్ నిరుద్యోగులకు ఆరు హామీలతో కొత్త ఆశలు రేపడం కూడా బీఆర్ఎస్ ఓడిపోవడానికి  కారణం అయింది.

దీనికి తోడు తెలంగాణ ప్రజల్లో  ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులపై  తీవ్ర వ్యతిరేకత ఉండటం కాంగ్రెస్‌కు బాగా కలిసి వచ్చినట్లు రాజకీయ విశ్లేషకులు  చెబుతున్నారు. కేసీఆర్ ఏక పక్ష నిర్ణయంతో ఆ ఎమ్మెల్యే అభ్యర్థులను  మార్చకపోవటంతో కేసీఆర్ తీసుకున్న నిర్ణయం తెలంగాణ ఓటర్ల ఆగ్రహానికి కారణం అయింది. ఇదే అంశం  కాంగ్రెస్ పార్టీ మరింత కలిసివచ్చింది.  అంతేకాదు గ్రూపు తగాదాలున్నా.. అంతా తానొక్కడే అన్నట్లుగా నడిపించిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నాయకత్వం కూడా కాంగ్రెస్ గెలుపునకు ఒక ఆయుధంగా మారిందనడంలో ఎటువంటి సందేహం లేదు.

బీఆర్ఎస్‌ రెండోసారి అధికారాన్ని చేపట్టిన తర్వాత కొత్త రేషన్ కార్డులు, కొత్త పింఛన్లు కానీ మంజూరు చేయకపోవడాన్ని కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రజల్లోకి బాగా తీసుకెళ్లగలిగారు. అలాగే ధరణి వెబ్‌సైట్‌పైన కూడా తెలంగాణ ఓటర్లలో  ఉన్న తీవ్ర వ్యతిరేకత కూడా చాలావరకూ అధికార బీఆర్ఎస్ పార్టీ ఓటమికి కారణంగా మారింది. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కనబరిచిన నిర్లక్ష్యాన్ని ప్రధాన అస్త్రంగా తీసుకున్న కాంగ్రెస్.. ఇందిరమ్మ ఇండ్లు లేని ఊరే లేదని చెప్పుకొచ్చింది. అలాగే డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు లేని ఊళ్లు మాత్రం వేలాదిగా ఉన్నాయనే విషయాన్ని ప్రజలలోకి బాగా తీసుకెళ్లింది.

దళిత బంధు, బీసీ బంధు పథకాల్లో బీఆర్ఎస్  పార్టీ నేతల ప్రమేయాన్ని కూడా కాంగ్రెస్‌కు తమకు అనుకూలంగా మారింది. అంతవరకూ ఎన్ని అంతర్గత కుమ్ములాటలు ఉన్నా..కీలకమైన అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ లోని నేతలందరూ సమైక్యరాగం వినిపించి అంతా కలిసి ముందుకు నడవడం కాంగ్రెస్‌కు కలిసొచ్చింది. అలాగే రాహుల్, సోనియా, ప్రియాంక గాంధీ వంటి అగ్రనేతల వరుస సభలు, ప్రచారాలు కూడా కాంగ్రెస్‌ విక్టరీకి పనికొచ్చాయి.

మరోవైపు  కీలకమైన అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే.. బీజేపీ..తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్‌ను మార్చటం బీజేపీకి ఎంత శాపంగా మారిందో..కాంగ్రెస్‌కు అంత వరంగా మారినట్లే అయింది.  బండి సంజయ్‌కు ఉన్న దూకుడు కిషన్ రెడ్డిలో కనిపించకపోవడం బీజేపీకి మైనస్ అయిందది. అయితే ఈ అంశాన్ని కూడా బీఆర్ఎస్, బీజేపీ కుట్రలో భాగంగా తీసుకున్న నిర్ణయమేనని కాంగ్రెస్ గట్టిగా చెప్పడమే.. ఈ విషయంపై ప్రజల్లో చర్చ జరిగేలా చేసిందనడంలో ఏ మాత్రం సందేహం లేదు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 − six =