ఇప్పటివరకూ అంతరిక్షంలోకి ఏఏ ప్రాణులు వెళ్లాయో తెలుసా?

Do You Know Which Creatures Have Gone Into Space So Far,Animals In Space,10 Animals That Have Been To Space,List Of Animals That Have Been To Space,Mango News,Mango News Telugu,First Animal In Space,First Cat In Space,First Dog In Space,Space Exploration,Animals Still Being Sent Into Space,Ants, Cats, Frogs, Jellyfish,Fruit Flies,First Animal In Space
NASA,tardigrade,ISS,International Space Station,Animals, man, creatures have gone into space, Animals into space,Rat,Monkey, Dog,the fly,Frogs, spiders, fish

అంతరిక్ష రంగంలో కొత్తకొత్త విజయాలు సాధించినప్పుడల్లా, మనమంతా సంబరాలు చేసుకుంటాం. అకుంఠితంగా శ్రమపడిన శాస్త్రవేత్తలను పొగుడుతూ.. వారి కష్టాన్నీ, ధైర్యాన్నీ మెచ్చుకుంటూ ఉంటాం. కానీ ఈ మహత్తర కార్యంలో.. చాలా జంతువులు కూడా పాల్గొన్నాయన్న విషయం చాలా కొద్ది మందికే తెలుసు. అవును.. అంతరిక్షంలోకి మనుషులు వెళ్లక ముందే చాలా జంతువులను అక్కడికి పంపించారు. ఆ తర్వాతే మనుషులను అంతరిక్షంలోకి సురక్షితంగా పంపించగలిగారు. ఇదొక్కటే కాదు.. మానవులు అంతరిక్షం, చంద్రమండలానికి చేరుకున్న తర్వాత కూడా, చాలాసార్లు జంతువులను ప్రయోగాల కోసం అంతరిక్షంలోకి పంపారు.

అంతరిక్షంలోకి వెళ్లిన మొదటి జీవులు ఈగలు అంటే..అంతా ఆశ్చర్యపోతారేమో. 1947లో మొట్టమొదటిగా ఈగలను అమెరికా శాస్త్రవేత్తలు పంపారు. ఈగల ద్వారా భవిష్యత్ వ్యోమగాములపై.. ఖగోళ రేడియేషన్ ఎలాంటి ప్రభావం చూపిస్తుందో శాస్త్రవేత్తలు తెలుసుకోవాలనుకుని ఈ ప్రయోగం చేశారు. V-2 బాలిస్టిక్ క్షిపణిని ఉపయోగించి 109 కి.మీటర్ల ఎత్తుకు మొదట్లో ఈగలను అంతరిక్షంలోకి పంపారు. ఆ తర్వాత పారాచ్యూట్ ద్వారా ఆ ఈగలను న్యూ మెక్సికోలో కూడా దింపి.. ఆ క్యాప్సూల్స్ తెరిచినప్పుడు ఈగలు సజీవంగానే కనిపించాయట.

ఇప్పటి వరకూ అంతరిక్షంలోకి పంపిన జంతువులలో.. కోతులు, కోతుల జాతులే ఎక్కువగా ఉన్నాయి. వీటిలో చింపాంజీలతో పాటు.. రీసస్ మకాక్స్, పిగ్ టెయిల్డ్ కోతులు, స్క్విరెల్ టెయిల్డ్ కోతులు ఉన్నాయి. 1949లో.. ఆల్బర్ట్ II అనే మొదటి రీసస్ మకాక్‌ 134 కి.మీటర్లు రవాణా అయింది. అయితే అది తిరిగి వస్తుండగా చనిపోయిందట. ఆ తరువాత, 1961లో, మొదటి కోతి జాతి, హామ్ అనే చింపాంజీని నాసా అంతరిక్షంలోకి పంపగా.. అది సురక్షితంగానే తిరిగి వచ్చింది.

సాధారణంగా మానవ ఆరోగ్యం, ఔషధాల తయారీ వంటి వాటికి సంబంధించిన అన్ని పరిశోధనలలో, ఎలుకలను ఎక్కువగా ఉపయోగించడం అందరికీ తెలిసిందే. అలాగే అంతరిక్షంలో గల వాతావరణం ప్రభావం మనుష్యులలో ఎంత అని తెలుసుకోవడానికి ఎలుకలను కూడా అంతరిక్షంలోకి పంపారు. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌కు పంపిన ఆ ఎలుకల అంతరిక్ష అనుభవం గురించి.. ఏకంగా నాసా ఒక వివరణాత్మక అధ్యయనాన్ని కూడా నిర్వహించింది. 1950లో 137 కి.మీటర్ల వరకు అంతరిక్షంలోకి తొలి ఎలుకను పంపారు. అయితే పారాచ్యూట్ ఫెయిల్యూర్‌తో ఆ ఎలుక చనిపోయింది.

అలాగే సోవియట్ యూనియన్ అంతరిక్షంలోకి.. ఎక్కువ సంఖ్యలోనే కుక్కలను పంపింది. వాటిలో అత్యంత ప్రసిద్ధమైనదిగా చెప్పుకునేది 1957లో లైకా అనే కుక్క గురించే. ఇది మాస్కో వీధుల్లో తిరిగేది. లైకాను రోదసిలోకి పంపగా.. ఎప్పటికీ భూమికి తిరిగి రాలేకపోయింది. కానీ ఇది అంతరిక్షంలోకి వెళ్లిన మొదటి యానిమల్‌గా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. అయితే దీనికి ముందు కూడా కుక్కలను అంతరిక్షంలోకి పంపిన చరిత్ర ఉంది.

కుక్కలు, కోతులు, ఎలుకలే కాదు..తాబేలును కూడా అంతరిక్షంలోకి పంపారు శాస్త్రవేత్తలు. 1968లో అమెరికా, సోవియట్‌ యూనియన్‌ల మధ్య చంద్రుడిపైకి వెళ్లడానికి పోటీ జరుగుతున్నప్పుడు..రెండు తాబేళ్లను .. జోండ్ 5 అనే అంతరిక్ష నౌకలో అంతరిక్షంలోకి పంపింది రష్యా. ఆ రెండు తాబేళ్లు చంద్రుడి చుట్టూ తిరిగి.. 6 రోజుల తర్వాత భూమి మీదకి తిరిగి వచ్చాయి. అయితే అనుకున్నదాని ప్రకారం అవి కజకిస్తాన్‌లో కాకుండా.. హిందూ మహా సముద్రంలో క్షేమంగానే పడ్డాయి.

ఇవి మాత్రమే కాదు 1973లో కప్పలు, సాలెపురుగులు, చేపలను కూడా అంతరిక్షంలోకి పంపారు. అలాగే 1963లో పిల్లిని. 2007లో సూక్ష్మజీవి టార్డిగ్రేడ్‌ను కూడా అంతరిక్షంలోకి శాస్త్రవేత్తలు పంపారు. 2012లో జపాన్, ‌ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌‌కు చేపలను పంపింది. కేవలం జంతువులపైనే కాదు..ఎన్నో రకాల మొక్కలపై, ముఖ్యంగా ఆహారం అందించే సలాడ్ మొక్కలపైన, చివరకు సూక్ష్మజీవుల పెరుగుదల పైన కూడా అంతరిక్షంలో చాలా ప్రయోగాలు జరిగాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × one =