జీహెచ్ఎంసీ మేయర్ ఎన్నిక: నూత‌న‌ కార్పొరేట‌ర్ల ప్ర‌మాణ‌స్వీకారం పూర్తి

2021 GHMC Mayor Election, GHMC, GHMC Mayor, GHMC Mayor Deputy Mayor Election, GHMC Mayor Election, GHMC Mayor Election 2021, GHMC mayor polls, Greater Hyderabad Mayor, Greater Hyderabad Municipal Corporation, Mango News, Mayor Election, Mayor Election 2021, Newly Elected Members Took Oath as Corporators

గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నికకు రంగం సిద్ధమైంది. ముందుగా జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయానికి నూతనంగా ఎన్నికైన కార్పొరేటర్లు చేరుకున్నారు. వీరితో ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ అధికారి, కలెక్టర్ శ్వేతా మ‌హంతి ప్ర‌మాణ‌స్వీకారం చేయించారు. భాషల ప్రతిపాదికన కార్పొరేట‌ర్లు సామూహికంగా ప్ర‌మాణం చేశారు. మొద‌టగా కొంతమంది తెలుగు భాషలో‌, త‌ర్వాత ఉర్దూ, హిందీ, ఇంగ్లీష్ భాష‌ల్లో కార్పొరేట‌ర్లు వరుసగా ప్ర‌మాణ‌స్వీకారం చేశారు. ఇక మ‌ధ్యాహ్నం 12:30 గంట‌ల‌కు మేయ‌ర్‌, డిప్యూటీ మేయ‌ర్ ఎన్నిక నిర్వహించనున్నారు.

గ్రేటర్ లో 150 డివిజన్లలో టీఆర్‌ఎస్‌ 56, బీజేపీ 48, ఎంఐఎం 44, కాంగ్రెస్ పార్టీ‌ 2 గెలుచుకున్న సంగతి తెలిసిందే. అయితే బీజేపీ పార్టీకి చెందిన లింగోజిగూడ డివిజన్‌ కార్పొరేటర్ మరణించడంతో ప్రస్తుతం కార్పొరేటర్ల సంఖ్య 149 గా ఉంది. అలాగే ఇద్దరు లోక్ సభ ఎంపీలు, ఆరుగురు రాజ్యసభ ఎంపీలు, 21 మంది ఎమ్మెల్యేలు, 15 మంది ఎమ్మెల్సీలుతో కలిపి 44 మంది ఎక్స్‌అఫీషియో సభ్యులుగా ఉండడంతో మొత్తం జీహెచ్‌ఎంసీ పాలకమండలి సభ్యుల సంఖ్య 193 కు చేరుకుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen − twelve =