తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్‌

Hyderabad Goshamahal BJP MLA Raja Singh Arrested Today Over Alleged Derogatory Remarks, Goshamahal BJP MLA Raja Singh Arrested Today Over Alleged Derogatory Remarks, Hyderabad Goshamahal BJP MLA Raja Singh Arrested, BJP MLA Raja Singh Arrested, Alleged Derogatory Remarks, MLA Raja Singh Derogatory Remarks, Derogatory Remarks, BJP MLA Raja Singh, MLA Raja Singh, BJP MLA Raja Singh Arrest News, BJP MLA Raja Singh Arrest Latest News And Updates, BJP MLA Raja Singh Arrest Live Updates, Mango News, Mango News Telugu,

తెలంగాణలోని భారతీయ జనతా పార్టీకి చెందిన గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఒక వర్గంపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారనే ఫిర్యాదు మేరకు ఆయన షాహినాయత్‌ గంజ్‌ పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. అరెస్టుకి దారి తీసిన పరిణామాలు ఇలా ఉన్నాయి. తాజాగా హైదరాబాద్‌లో ప్రముఖ కమెడియన్‌ మునావర్‌ ఫారూకి షో జరిగింది. అయితే ఈ షోను అడ్డుకుంటామని రాజాసింగ్‌ ప్రకటించిన నేపథ్యంలో పోలీసులు ఆయనను హౌస్‌ అరెస్ట్‌ చేశారు. దీనిపై రాజాసింగ్‌ ఓ వీడియోను యూట్యూబ్‌లో విడుదల చేశారు. దీనిలో ఒక వర్గం ప్రజలను ఉద్దేశించి పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో పోలీసుల విజ్ఞప్తి మేరకు రాజా సింగ్ వీడియోను యూట్యూబ్ తొలగించింది.

కాగా వీడియోలో రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలపై ఎంఐఎం పార్టీ కార్యకర్తలు, సానుభూతిపరులు పలువురు మండిపడ్డారు. ఈ క్రమంలో నగర పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్లలో ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేశారు. తమ మనోభావాలను ఎమ్మెల్యే దెబ్బతీశారని ఆరోపించిన ఆందోళనకారులు, నిన్న రాత్రి ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నగరంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన రాజాసింగ్‌ను తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్‌ చేస్తూ పెద్ద ఎత్తున ప్రజలు రోడ్లపైకి వచ్చారు. ఈ నేపథ్యంలో స్పందించిన నగర పోలీసులు ఎమ్మెల్యేపై డబీర్‌పురా పీఎస్‌లో నమోదైన కేసులో భాగంగా.. మంగళవారం ఉదయం రాజాసింగ్‌ ఇంటికి చేరుకున్న పోలీసులు ఎమ్మెల్యేను అరెస్ట్‌ చేసి పీఎస్‌కు తరలించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three + fifteen =