నేడు రంజాన్ మాసం చివరి శుక్రవారం సందర్భంగా.. చార్మినార్ వద్ద ప్రత్యేక ప్రార్థనలు, పోలీసుల భారీ బందోబస్తు

Hyderabad High Security and Special Arrangements Set up For Prayers at Charminar During Last Friday of Ramzan,Hyderabad High Security and Special Arrangements Set up,Special Arrangements Set up For Prayers at Charminar,Prayers at Charminar During Last Friday of Ramzan,Mango News,Mango News Telugu,Hyderabad Last Friday of Ramzan,Traffic curbs around Charminar,Jummat-ul-Vida prayers,Traffic diversions on April 21 in view of Jummat-Ul-Vida,Elaborate arrangements made for Jumat ul Vida,Traffic curbs around Charminar,Hyderabad Jummat-ul-Vida prayers Latest News,Hyderabad Jummat-ul-Vida prayers Latest Updates

రంజాన్ మాసం చివరి శుక్రవారం సందర్భంగా.. ఈరోజు హైదరాబాద్‌లోని చార్మినార్ వద్ద ముస్లింలు సామూహిక ప్రత్యేక ప్రార్థనలు చేయనున్నారు. ముస్లిం క్యాలెండర్‌లోని ముఖ్యమైన మతపరమైన కార్యక్రమం కావడంతో దీనికి పెద్ద ఎత్తున హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో.. చార్మినార్ వద్ద నగర పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. పోలీసులు, ఆర్‌పీఎఫ్ బలగాలను భారీగా మోహరించారు. జమాతుల్ విధా (ప్రత్యేక సామూహిక ప్రార్ధన) సందర్భంగా అక్కడి మక్కా మసీదులో ప్రత్యేక ప్రార్థనలు జరుగనున్నాయి. ఈరోజు మధ్యాహ్నం 1:10 గంటలకు ప్రత్యేక ప్రార్థనలు ప్రారంభం అయ్యాయి. ఈ క్రమంలో ముస్లిం పెద్దలు ప్రార్ధనల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కాగా రంజాన్ మాసంలో చివరి శుక్రవారం నాడు ‘జుమాతుల్ విధా’ నిర్వహించడం ఎప్పటినుంచో ఆచారంగా వస్తోంది.

మరోవైపు శుక్రవారం ప్రార్థనల సందర్భంగా.. ఓల్డ్ సిటీలోని పలు ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ముఖ్యంగా మక్కా మసీద్‌లో ప్రత్యేక ప్రార్థనల నేపథ్యంలో చార్మినార్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపు చర్యలు చేపట్టారు. చార్మినార్-మదీనా, చార్మినార్-ముర్గీ చౌక్, చార్మినార్ -రాజేష్ మెడికల్ హాల్, శాలిబండ మధ్య ప్రధాన రహదారులు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3:30 గంటల వరకు అన్ని రకాల వాహనాల రాకపోకలు నిలిపివేయనున్నారు. ఈ క్రమంలో చార్మినార్ వైపు వచ్చే ట్రాఫిక్‌ను వివిధ పాయింట్ల వద్ద మళ్లించనున్నారు. దీనిలో భాగంగా.. నయాపూల్ వైపు నుంచి చార్మినార్ వైపు వచ్చే ట్రాఫిక్‌ను మదీనా జంక్షన్ వద్ద సిటీ కాలేజీ వైపునకు మళ్లించారు. అలాగే హిమ్మత్‌పురా, చౌక్ మైదాన్ ఖాన్, మోతిగల్లి, ఈతేబార్ చౌక్, సెహర్-ఎ-బాటిల్ కమాన్, లక్కడ్ కోటే వద్ద ట్రాఫిక్ మళ్లించనున్నారు. ఇక మక్కా మసీదుకు వచ్చే వారి వాహనాలకు వేర్వేరుగా ఏడు చోట్ల పార్కింగ్‌ ఏర్పాటు చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 + 11 =