ఆన్‌లైన్‌ గేమింగ్ ద్వారా బెట్టింగ్‌, నలుగురిని అరెస్ట్ చేసిన హైదరాబాద్‌ పోలీసులు

3 Arrested For Running Online Gambling Racket, Hyderabad, Hyderabad News, Hyderabad Police, Hyderabad Police Busts Online Gambling Gaming, Hyderabad Police Busts Online Gambling Gaming Racket, Online Gambling Gaming Racket, Online Gambling Gaming Racket In Hyderabad

ఆన్‌లైన్ బెట్టింగ్ నిర్వహించి పలువురిని మోసం చేసినందుకు చైనాకు చెందిన వ్యక్తితో సహా నలుగురిని హైదరాబాద్ సీసీఎస్‌ పోలీసులు అరెస్ట్ చేశారు. ‘కలర్ ప్రిడిక్షన్’ అనే చైనా ఆన్‌లైన్‌ గేమింగ్‌ ద్వారా ఈ ముఠా బెట్టింగ్ కు పాల్పడుతుందని హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్‌ అంజనీ కుమార్ తెలిపారు. ఈ ముఠా అరెస్ట్ కు సంబంధించి పలు విషయాలను మీడియాకు వెల్లడించారు. ఈ ఆన్‌లైన్‌ గేమింగ్ కోసం టెలిగ్రామ్‌, వాట్సాప్‌ గ్రూప్ లలో రిఫెరెన్స్‌ల ద్వారా చేర్చుకుంటారని, అయితే ప్రతి రోజు వెబ్‌సైట్‌ మరియు గ్రూప్‌లు మారుస్తూ నడిపిస్తున్నారని చెప్పారు. ఈ గేమింగ్‌ బెట్టింగ్ కు సంబందించి మూడు కంపెనీల డైరెక్టర్లు చైనా, భారత్‌ లో ఉన్నట్లు గుర్తించినట్లు అంజనీ కుమార్ తెలిపారు.

గేమింగ్ వెబ్‌సైట్ల యొక్క డొమైన్ పేర్లు చైనాకు చెందినవని పోలీసులు కనుగొన్నారని, డేటా హోస్టింగ్ సేవలు యుఎస్‌లో క్లౌడ్ బేస్ చేసి, కార్యకలాపాలు చైనా నుండి సాగిస్తున్నారన్నారు. ఈ ఆన్‌లైన్‌ గేమింగ్‌లో గత ఏడు నెలల్లోనే రూ.1,100 కోట్లు వినియోగించినట్లు తేలిందని, దాదాపు 110 కోట్ల రూపాయల విదేశీ చెల్లింపులు కూడా గుర్తించినట్టు తెలిపారు. అలాగే ప్రస్తుతం రూ.30 కోట్ల మేర బ్యాంక్‌ ఖాతాలు సీజ్‌ చేశామని సీపీ వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో ఆన్‌లైన్‌ గేమింగ్‌ రద్దైందని అన్నారు. ఇలాంటి గేమింగ్ బెట్టింగ్ లో పాల్గొని, డబ్బు పోగొట్టుకుని మోసపోయి చాలామంది ఆత్మహత్యలు పాల్పడుతున్నారని సీపీ చెప్పారు. పిల్లలు, యువకులు ఆన్‌లైన్‌లో ఏం చేస్తున్నారో అనే అంశమై తల్లిదండ్రులు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ కేసులో నమోదైన నగదు వివరాలపై ఐటీ శాఖకు సమాచారం ఇచ్చామని, పూర్తి దర్యాప్తు కొనసాగుతుందని సీపీ అంజనీ కుమార్‌ పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × five =