ఎన్నికలయ్యాక ఇళ్లు కొంటే మంచిదా.. ఇప్పుడు కొంటే మంచిదా?

Is it better to buy houses after the election Is it better to buy now,Is it better to buy houses after the election,Is it better to buy now,buy houses after the election,Mango News,Mango News Telugu,Hyderabad Real Estate, Hyderabad, buy houses, election, better to buy now Hyderabad houses, time to buy houses in Hyderabad,Hyderabad Real Estate Latest News,Hyderabad Real Estate Latest Updates,Telangana Politics, Telangana Political News And Updates,Hyderabad News
Hyderabad Real Estate, Hyderabad, buy houses, election, better to buy now Hyderabad houses, time to buy houses in Hyderabad

తెలంగాణలో ఇప్సుడు అందరి చూపూ అసెంబ్లీ ఎన్నికల మీదే ఉంది. ఏ ఇద్దరు కలిసినా ఏ పార్టీ గెలుస్తుంది.. ఏ పార్టీ ఓడుతుందనే మాట్లాడుకునేంతగా ఇప్పటికే ఎన్నికల వేడి పెరిగిపోయింది. అయితే మరోవైపు మాత్రం.. ప్రాపర్టీ కొనాలనుకునేవాళ్లు ఈ సమయంలో కొనొచ్చో.. లేదోనని ఆలోచనల్లో పడ్డారు. ఎన్నికలు ముగిశాకే ప్రాపర్టీని కొంటే మంచిదనేమోనని వెనుకడుగువేస్తున్నారు.

ఎన్నికల తరువాత వచ్చే  కొత్త ప్రభుత్వాన్ని బట్టి ఇళ్ల ధరలు, స్థలాల ధరలు తగ్గుతాయని చాలా మంది ఆలోచిస్తున్నారు. దీంతోనే ఎన్నికల వరకు వేచి చూద్దామన్న ఫీలింగ్‌లోకి వెళ్లిపోయారు . ఇలాంటి ప్రచారంతో ఎప్పటినుంచో సొంతింటిని కొనాలని అనుకున్నవారు కూడా ఆలోచనల్లో పడ్డారు. ఇంటిని ఇప్పుడు కొంటే మంచిదా లేదా.. ఎన్నికలు అయ్యే వరకు ఆగాలా అన్న ఆయోమయంలో పడిపోయారు.

అయితే సొంతిల్లు కొనాలనుకునేవారికి  ఇదే సరైన సమయమని .. రియల్ ఎస్టేట్ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్‌కు, రియల్ ఎస్టేట్ మార్కెట్‌కు ఏ మాత్రం సంబంధమే లేదని  చెబుతున్నారు. మరోవైపు ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్‌లో ఇళ్ల ధరలు కాస్త అందుబాటులోనే ఉన్నాయన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. నిజానికి ఇతర రాష్ట్రాలు, సిటీలతో పోల్చుకుంటే.. హైదరాబాద్‌లో ఎస్‌ఎఫ్‌టీ ధర చాలా తక్కువగా ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయని అంటున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో వందల కొద్దీ భారీ నివాస, వాణిజ్య నిర్మాణాలు అందుబాటులోనే ఉన్నాయి. అందుకే సొంతిల్లు కొనాలనుకుంటున్న వారికి ఇదే కరెక్ట్ సమయం అని సలహా ఇస్తున్నారు.

అంతకుముందు అంటే కరోనా సమయంలో రియల్ రంగం ఎదుర్కొన్న సంక్షోభాన్ని రియల్ ఎస్టేట్ రంగ నిపుణులు గుర్తు చేస్తున్నారు .ఆ  సమయంలో సడన్‌గా  పడిపోయిన రియల్ భూమ్ కరోనా నెమ్మదించాక.. అంతే స్పీడుతో  ఒక్కసారిగా పైకి లేచిందని.. మొన్న అయితే కోకాపేట భూములు ఎవ్వరూ ఊహించని విధంగా రేట్లు పెరిగి రికార్డులు సృష్టించాయని అంటున్నారు. దీనికి తోడు నిర్మాణ సామగ్రి, కూలీల వ్యయం కూడా పెరగడంతో ఇంటి ధరలు ఇప్పుడు భారీగా పెరిగాయి. కేవలం ఈ రెండేళ్లనే హైదరాబాద్‌లోని చాలా ప్రాంతాల్లో .. ఎస్‌ఎఫ్‌టీ రూ.  వెయ్యి నుంచి రూ.  మూడు వేల  వరకు పెరిగింది. వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్‌ వంటి  నగరాల్లో ఇంకా  ఇళ్ల ధరలు పెరుగుతాయే  తప్ప తగ్గే అవకాశాలుండవని క్లారిటీ ఇస్తున్నారు. అందుకే  కాస్మో పాలిటన్ సిటీ అయిన హైదరాబాద్‌‌లో ఎక్కడ చూసినా నిర్మాణాలు జరగడానికి ఇదే కారణమని చెబుతున్నారు.

కాకపోతే ఆర్థిక సంక్షోభం వల్ల ఇన్వెస్టర్స్ చాలామంది రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడి పెట్టుబడులు పెట్టడానికి  వెనుకడుగు వేస్తున్నారు. మళ్లీ వాళ్లంతా కాస్త కుదుటపడగానే ఒక్కసారిగా రియల్ ఎస్టేట్ రంగం పుంజుకుంటుందని రియల్టీ ఎక్స్‌పర్ట్స్‌ అంచనా వేస్తున్నారు. అంతేకానీ దీనికి ఎన్నికల సమయానికి ఎలాంటి సంబంధం లేదని అంటున్నారు. అంతేకాదు ఎన్నికల కోసం  కొంతమంది నేతలు ఇతర అవసరాల కోసం కొన్ని భూములను, ఇళ్లను కూడా అమ్మే వీలుంటుంది కాబట్టి కాస్త తక్కువగానే దొరికే అవకాశం ఉంటుందని  చెబుతున్నారు. అందుకే సొంతింటి కలను నెరవేర్చుకోవడానికి ఇదే సరైన సమయమని రియల్టీ నిపుణులు సూచిస్తున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × three =