చంద్ర‌బాబుకు ఆ బెంగ ఉందా?

Does Chandrababu have that angst,Chandrababu have angst,Does Chandrababu have angst,Mango News,Mango News Telugu,Balakrishna, Chandrababu Naidu, Nara Lokesh, Skill Development Scam Case, Telugu Desam Party,TDP Chief Chandrababu Naidu,AP Politics,AP Latest Political News,Andhra Pradesh Latest News,Andhra Pradesh News,Andhra Pradesh News and Live Updates,Chandrababu Naidu Latest News,Chandrababu Naidu Latest Updates,Chandrababu Naidu Live News
chandrababu naidu, skill development scam case, telugu desam party, nara lokesh, balakrishna

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు 37 రోజులుగా జైలులోనే ఉన్నారు. బెయిలు పై వ‌చ్చే అవ‌కాశాలు ఇప్ప‌ట్లో క‌నిపించ‌డం లేదు. అరెస్ట‌యిన కొత్త‌లో నారా లోకేశ్ తో పాటు నంద‌మూరి బాల‌కృష్ణ కూడా సీన్‌లోకి వ‌చ్చి హ‌డావిడి చేశారు. టీడీపీ శ్రేణుల‌తో స‌భ‌లు, స‌మావేశాలు నిర్వ‌హించారు. ఓ సంద‌ర్భంలో చంద్ర‌బాబు సీటులోనే కూర్చుని ఆయ‌న అరెస్ట్ , పార్టీ ప‌రంగా తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై చ‌ర్చించారు. మీకేం భ‌యం లేదు.. నేను వ‌స్తున్నా.. నేనున్నా అంటూ పార్టీ నేత‌ల‌కు అభ‌యం ఇచ్చారు. పార్టీ శ్రేణుల్లో ఆ వ్యాఖ్య‌లు భ‌రోసా క‌ల్పించాయో.. లేదో కానీ.. చంద్ర‌బాబులో మాత్రం అభ‌ద్ర‌త‌కు కార‌ణం అయ్యాయ‌న్న ప్ర‌చారం జ‌రిగింది. నారా వారి చేతిలోంచి.. మ‌ళ్లీ నంద‌మూరి వారి చేతులోకి పార్టీ వెళ్లి పోతుంద‌న్న చ‌ర్చ‌లూ జ‌రిగాయి. ఇప్పుడు కూడా చంద్ర‌బాబును ఆ భ‌యం వెంటాడుతోందంటూ వైసీపీ శ్రేణులు ఎద్దేవా చేస్తూనే ఉన్నారు. ఎందుకంటే.. బాబు చేతిలోకి పార్టీ కూడా వెన్నుపోటు వ‌ల్లే వ‌చ్చింద‌న్న వాద‌న ఎలాగూ ఉంది. అందుకే చంద్ర‌బాబుకు కూడా వెన్నుపోటు బెంగ ఉంద‌నేది వైసీపీ లేవ నెత్తుతున్న చ‌ర్చ‌.

తెలుగుదేశం పార్టీకి నాయ‌కుడు ఎవ‌రంటే.. చంద్రబాబు త‌ప్ప మ‌రో నేత పేరు ఇప్ప‌టి వ‌ర‌కూ రానే లేదు. మూడు దశాబ్దాలుగా పార్టీని తన భుజాల మీద వేసుకుని నడిపిస్తున్నారు. ఇపుడిపుడే కుమారుడు లోకేష్ కొంత ముందుకు వస్తున్నారు. తండ్రీత‌న‌యులు ఇద్ద‌రూ క‌లిసి వ‌చ్చే ఎన్నిక‌ల్లో పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు విశ్వ ప్ర‌య‌త్నాలు చేస్తున్న క్ర‌మంలో.. బాబు అరెస్ట్ అయ్యారు. చంద్రబాబు లేని టీడీపీ కుదుపున‌కు గురైంది. అదే స‌మ‌యంలో ఎన్టీఆర్ కుటుంబ సభ్యులలో టీడీపీలో చురుకున్న ఉన్న వారు హీరో నందమూరి బాలక్రిష్ణ. ఆయన పార్టీని లీడ్ చేయడానికి ఉత్సాహంగా ముందుకు వ‌చ్చారు. బాబు అరెస్ట్ అయిన రెండవ రోజే మంగళగిరిలోని కేంద్ర పార్టీ ఆఫీసులో ఏకంగా బాబు కుర్చీలోనే కూర్చుని నేను ఉన్నా వస్తున్నా అని ఒక కీలక స్టేట్మెంట్ ఇచ్చేశారు. బాబు అరెస్ట్ వల్ల చనిపోయిన వారి కుటుంబాలను ఓదారుస్తాను అని కూడా ప్రకటించారు.

అయితే బాలయ్య స్పీడ్ చూసి రాజ‌కీయాల్లో ఓ ర‌క‌మైన చ‌ర్చ జ‌రిగింది. గ‌తంలో ఎన్టీఆర్ – చంద్ర‌బాబు ఎపిసోడ్ క‌ళ్ల‌ముందు క‌ద‌లాడింది. దీంతో వెంట‌నే టీడీపీ అనుకూల మీడియాలోని కొందరు.. పార్టీలోని ముఖ్యులు అల‌ర్ట్ అయ్యారు.  నారా వారసత్వం గుప్పిటనే టీడీపీ ఉంటే మేలు అన్నట్లుగా డైరెక్షన్ ఇస్తున్నారు అని ప్రచారం సాగుతోంది. నారా లోకేష్ ని ఢిల్లీ పంపించడం, నేషనల్ మీడియా ముందు ఫోకస్ అయ్యేలా చూడడం కూడా ఆ డైరెక్షన్ లో భాగమే అంటున్నారు. మరో వైపు చూస్తే టీడీపీలో జోష్ తగ్గకుండా ఉండేందుకు పక్క పార్టీ నేత అయిన జనసేనానితో పొత్తు ఒప్పందం కూడా అర్జంటుగా కుదుర్చుకున్నారు. అలా ఏపీలో ఢిల్లీలో పవన్ లోకేష్ ఇద్దరూ లీడ్ చేసేలా ఒక టెంపరరీ యాక్షన్ ప్లాన్ అయితే రూపొందించారు అని అంటున్నారు. ఇక ఇపుడు నారా లోకేష్ సతీమణి బ్రాహ్మణిని కూడా రంగంలోకి దిగారు.

ఈ వ్య‌వ‌హారాల‌న్నీ ప‌రిశీలిస్తే.. పార్టీ చేజారిపోతుంద‌న్న బెంగ‌తోనే.. చంద్ర‌బాబు డైరెక్షన్‌లోనే పొత్తులు.. ఆందోళ‌న‌లు  వంటి నిర్ణ‌యాల‌న్నీ ఆఘ‌మేఘాల మీద తీసుకున్నార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. ఒక‌వేళ లోకేశ్ కూడా అరెస్ట్ అయ్యే ప‌రిస్థితులు వ‌స్తే.. పార్టీని న‌డిపించేలా బ్రాహ్మ‌ణికి కూడా త‌గిన సూచ‌న‌లు ఇస్తున్న‌ట్లు తెలుస్తోంది. మ‌రి ఇదంతా నిజ‌మేనా..? వైసీపీ చేస్తున్న‌వి ఆరోప‌ణ‌లోనే.. నిజంగా చంద్ర‌బాబుకు పార్టీ చేజారిపోతుందేమో అన్న బెంగ‌తో అనారోగ్య స‌మ‌స్య‌లు ఉత్ప‌న్న‌మ‌వుతున్నాయా.. అనే ప్ర‌శ్న‌లు ఉత్ప‌న్న‌మ‌వుతున్నాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 − four =