తెలంగాణలో కైటెక్స్ గ్రూప్ రూ.1000 కోట్ల పెట్టుబడులు

KITEX, Kitex announces Rs 1000 crore investment in Telangana, Kitex Garments, KITEX Group Announced Rs 1000 Cr Investment, KITEX Group Announced Rs 1000 Cr Investment in Telangana, KITEX Group Announced Rs 1000 Cr Investment in Telangana State, Kitex group enters into Rs 1000 crore investment deal, Kitex group to invest Rs 1000 crore, Kitex to set up its facility in Telangana with Rs 1000 cr, Mango News, telangana, Tycoon Dumps Kerala

తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబ‌డులు పెట్టేందుకు మరో సంస్థ ముందుకొచ్చింది. కేరళకు చెందిన ప్రముఖ కైటెక్స్ గ్రూప్ తెలంగాణలో రూ.1000 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. పిల్లల దుస్తువుల త‌యారీలో ప్రపంచంలో 2వ స్థానంలో ఉన్న కైటెక్స్ గ్రూప్ తెలంగాణలోకి పెట్టుబడులు పెడుతున్నట్టు ప్రకటించినందుకు సంతోషంగా ఉందని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల, పురపాలక మంత్రి కేటీఆర్ వెల్లడించారు. వరంగల్ జిల్లాలోని కాక‌తీయ మెగా టెక్స్‌టైల్ పార్క్‌(కేఎంటీపీ)లో తొలిద‌శ‌లో కైటెక్స్ గ్రూప్ రూ.1000 కోట్ల పెట్టుబ‌డి పెట్ట‌నున్న‌ట్లు తెలిపారు. సత్వర నిర్ణయం తీసుకున్నందుకు కైటెక్స్ గ్రూప్ ఎండీ సాబు ఎం.జాకబ్ కు మంత్రి కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు.

ముందుగా కైటెక్స్ గ్రూప్ సంస్థ ఎండీ సాబు ఎం.జాకబ్‌, సంస్థ ప్రతినిధులు శుక్రవారం నాడు మంత్రి కేటీఆర్ తో ప్రగతిభవన్‌లో భేటీ అయ్యారు. ప్రాథమిక చర్చల అనంతరం హెలికాప్టర్‌లో వెళ్లి వరంగల్‌ లోని కేఎంటీపీని సందర్శించారు. అనంతరం మరోసారి మంత్రి కేటీఆర్ తో భేటీ అయి పెట్టుబడులపై ప్రకటన చేశారు. వచ్చే రెండేళ్ల వ్యవధిలో తొలిదశ పనుల్లో భాగంగా టెక్స్‌టైల్‌ అపారెల్‌ పరిశ్రమను కైటెక్స్ గ్రూప్ స్థాపించనుంది. ఈ సంస్థ ద్వారా నాలుగువేల మందికి ఉపాధి లభించనుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 − five =