మల్కాజ్‌గిరి నుంచి ఎంపీగా మల్లారెడ్డి పోటీ..?

Mallareddy contest as MP from Malkajgiri,Mallareddy contest as MP,MP from Malkajgiri,Ex minister Mallareddy, Mallareddy, BRS, Malkajgiri, Lokhsabha Elections,Mango News,Mango News Telugu,Malkajgiri Lok Sabha constituency,Mallareddy Latest News,Mallareddy Latest Updates,Mallareddy Live News,Ex minister Mallareddy Latest Updates,Malkajgiri Live News
Ex minister Mallareddy, Mallareddy, BRS, Malkajgiri, Lokhsabha Elections

చామకూర మల్లారెడ్డి.. ఆయన ఏం చేసినా సంచలనమే. తన ప్రసంగాలు, డైలాగులు, పంచ్‌లతో సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంటారు మల్లారెడ్డి. అయితే మల్లారెడ్డి ఓ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు మల్లారెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారట. బీఆర్ఎస్ హైకమాండ్ ఆదేశిస్తే.. మల్కాజ్‌గిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు మల్లారెడ్డి సిద్ధంగా ఉన్నారట.

2014లో మల్లారెడ్డి తెలుగు దేశం పార్టీ తరుపున మల్కాజ్‌గిరి నుంచి లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత కొద్దిరోజులకు బీఆర్ఎస్‌లో చేరిపోయారు. 2018లో మేడ్చల్ నుంచి బీఆర్ఎస్ తరుపున పోటీ చేసి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా తిరిగి అదే స్థానం నుంచి పోటీ చేసి ఘన విజయం సాధించారు. 33 వేలకు పైగా మెజార్టీతో మల్కాజ్‌గిరి నుంచి మల్లారెడ్డి రెండోసారి గెలుపొందారు. అయితే ప్రస్తుతం బీఆర్ఎస్ అధికారంలో లేకపోవడంతో.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసి పార్లమెంట్‌లో అడుగుపెట్టాలని మల్లారెడ్డి భావిస్తున్నారట.

ఈక్రమంలో బీఆర్ఎస్ హైకమాండ్ ఆదేశిస్తే మల్కాజ్‌గిరి నుంచి లోక్ సభ ఎన్నికల్లో ఎంపీగా పోటీ  చేస్తానని మల్లారెడ్డి ప్రకటించారు. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని అన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మల్కాజ్‌గిరి పార్లమెంట్ పరిధిలోని మెజార్టీ అసెంబ్లీ స్థానాలను బీఆర్ఎస్ గెలుచుకుంది. అలాగే మల్కాజ్‌గిరి ఎమ్మెల్యేగా కూడా మల్లారెడ్డి అల్లుడు.. మర్రి రాజశేఖర్ రెడ్డి ఉన్నారు. ఈక్రమంలో మల్కాజ్‌గిరి నుంచి ఎంపీగా పోటీ చేస్తే తాను కచ్చితంగా గెలిచి తీరుతానని మల్లారెడ్డి భావిస్తున్నారట. మరి దీనిపై బీఆర్ఎస్ హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × 5 =