3010 ఐసీయూ బెడ్స్ 10 రోజుల్లో అందుబాటులోకి తీసుకురావాలి: మంత్రి ఈటల

Minister Etala Rajender Held a Teleconference With Health Officials on Covid-19 Situation,Mango New,Mango News Telugu,Minister Etela Rajender Press Meet LIVE,Covid Situation,Minister Etala Rajender,Etala Rajender,Minister Etala Rajender Press Meet,Minister Etala Rajender Live,Minister Etala Rajender Press Meet Live,Minister Etala Rajender Held a Teleconference,Minister Etala Rajender With Health Officials on Covid-19 Situation,Minister Etela Rajender Press Conference on Covid-19,Minister Etala Rajender on Covid-19 Situation,Minister Etala Rajender Latest News,Minister Etala Rajender News,Minister Etala Rajender Teleconference

రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు, జిల్లాల వైద్య అధికారులు, ఆసుపత్రుల సూపరింటెండెంట్స్ తో తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ గురువారం నాడు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలుకీలక నిర్ణయాలు తీసుకుకున్నారు. మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ, “కంటి మీద కునుకు లేకుండా పని చేస్తున్నాం కాబట్టే ఈ రోజు మనం మెరుగ్గా ఉన్నాము. చిన్న చిన్న సమస్యలు కూడా లేకుండా చూడాలని కోరుతున్నాము. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న పేషంట్ల బందువులకు సమాచారం అందించడానికి వ్యవస్థ ఏర్పాటు చేయాలి. పరిశుభ్రత ఉండేలా చూడాలి, పేషంట్లను ప్రతి రెండు గంటలకు ఒకసారి మానిటర్ చేయాలి. ఆక్సిజన్ కనీసం 24 గంటల ముందస్తుగా ఉండేలా చూడాలి. 3010 ఐసీయూ బెడ్స్ 10 రోజుల్లో అందుబాటులోకి తీసుకు రావాలి. సిబ్బంది అందరూ సంయమనంతో పని చేయాలి” అని జిల్లా వైద్య అధికారులు, ఆసుపత్రుల సూపరింటెండెంట్స్ తో మంత్రి ఈటల రాజేందర్ అన్నారు.

“ఆక్సిజన్, ఐసీయూ, వెంటిలేటర్ బెడ్స్ కోసం ఎక్కువ డిమాండ్ వస్తుంది. ఎంత మంది పేషంట్లు వచ్చిన చేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. హాస్పిటల్ లో ఉన్న పేషంట్ల ఆరోగ్య పరిస్థితిని ఉదయం, సాయంత్రం పరిశీలించి మంచిగా ఉన్న పేషంట్లను డిశ్చార్జ్ చేయాలి. ప్రతి రోజు పేషంట్ ఆరోగ్య పరిస్థితిని వారి బందువులకు ఫోన్ ద్వారా అందించాలి. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో రెమిడీస్వీర్ ఇంజక్షన్లు అందుబాటులో ఉన్నాయి. పేషంట్లకు ఇచ్చిన ప్రతి ఇంజక్షన్ ఖాళీ సీసాను తిరిగి స్టోర్ లో సబ్మిట్ చేస్తున్నాము” ఈ సందర్భంగా డిఎంఈ తెలిపారు. అలాగే ఆక్సిజన్ నిలువల సమాచారం అందించేందుకు ప్రతి ఆసుపత్రిలో ఒక నోడల్ ఆఫీసర్ ను ఏర్పాటు చేస్తున్నామని, ప్రతి ఆసుపత్రిలో జనరేటర్లు పూర్తి స్థాయిలో పని చేసేలా సిద్దం చేసి ఉన్నాయి. టెస్టింగ్, ట్రేసింగ్ చేస్తూ ఎక్కువ వ్యాప్తి చెందకుండా ఆపగలుగుతున్నామని డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ శ్రీనివాస్ తెలియజేశారు.

మంత్రి స్పందిస్తూ “లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కరికీ పరీక్షలు చేయాలి. లక్షణాలు ఉంటే చికిత్స మొదలు పెట్టండి. హోమ్ ఐసోలేషన్ లో ఉన్న ప్రతి ఒక్కరినీ ఏఎన్ఎం ఆశా వర్కర్స్ పరిశీలన చేయాలి. 5 రోజులకు మించి లక్షణాలు కొనసాగినా ఆక్సిజన్ సాచురేషన్ లెవల్ లు 95 కంటే తగ్గిన డాక్టర్ ల పర్యవేక్షణలో పెద్దాసుపాత్రులకు తరలించాలి. సెకండ్ డోస్ వేసుకొనే వారికి ఇబ్బందులు రాకుండా చూడాలి. ముందుగా వారికి వాక్సిన్ అందించాలి. 18 సంవత్సరాల పైబడిన వారందరికీ వాక్సిన్ ఇవ్వడానికి త్వరలో నియమ నిబందనలు అందిస్తాము. ఈ సందర్భంగా టెస్టింగ్స్ కి వచ్చేవారికి, వాక్సిన్ వేసుకోవడానికి వచ్చే వారికి సీనియర్ సిటిజన్స్ కి ప్రత్యేక లైన్స్ ఏర్పాటు చేయాలని” ఆదేశాలు జారీ చేశారు.

అనంతరం హెల్త్ సెక్రెటరీ రిజ్వీ మాట్లాడుతూ, “ఇప్పుడు ఆసుపత్రుల పాత్ర చాలా కీలకం. ప్రాణాలు పోకుండా కాపాడుకోవాలి. ఆసుపత్రులలో చేర్చుకోవడానికి ఎక్కువ సమయం తీసుకోవద్దు. ఆసుపత్రులకు వచ్చిన పేషంట్లను ఎక్కువ సేపు వేచి చూడకుండా వెంటనే వీలు ఉన్న చోట చేర్చుకోవాలి. గ్రామాల్లో కూడా వైరస్ పాకింది కాబట్టి ఎక్కివ వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. లక్షణాలకు అనుగుణంగా వారిని ఆసుపత్రులకు పంపించాలి” అని డాక్టర్ లను కోరారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 2 =