రాష్ట్రంలో కరోనా పరిస్థితి అదుపులో ఉంది, ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కునేందుకు సిద్ధం

CM KCR, COVID-19 Surge In Telangana, Health Minister Harish Rao, Health Minister Harish Rao Explains Covid Situation in the State, KCR Cabinet Meeting, Mango News, Minister Harish Rao Explains Covid Situation, Omicron, Omicron variant, Telangana Cabinet Meet, Telangana Cabinet Meeting, Telangana Cabinet Meeting Highlights, Telangana Cabinet Meeting Today, Telangana Coronavirus, Telangana Coronavirus News, Telangana Covid-19 Updates, Telangana Department of Health, Telangana Govt Cabinet Meeting

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన సోమవారం మధ్యాహ్నం ప్రగతి భవన్ లో రాష్ట్ర కేబినెట్ సమావేశమైంది. ముందుగా కేబినెట్ సమావేశంలో రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై చర్చించారు. ఈ సందర్భంగా వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు, రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై గణాంకాలతో సహా వివరించారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితి అదుపులో ఉన్నదని, ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కునేందుకు అన్ని విధాలుగా రాష్ట్ర వైద్యారోగ్యశాఖ సంసిద్ధంగా ఉన్నదని తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటికే 5 కోట్ల వాక్సినేషన్ డోసులు ఇవ్వడం జరిగిందని, అర్హులైన అందరికీ అతి త్వరగా వాక్సినేషన్ ఇవ్వడం జరుగుతుందని మంత్రి హరీశ్ రావు తెలిపారు. కరోనాను కట్టడి చేసేందుకు ప్రజలు గుంపులు గుంపులుగా గుమిగూడకుండా పూర్తి స్వీయ నియంత్రణ పాటించడం ద్వారా కరోనాను కట్టడి చేయవచ్చని మంత్రి హరీశ్ రావు తెలిపారు.

అలాగే మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖల అధికారుల సహాయం తీసుకోని, వారితో సమన్వయం చేసుకుంటూ వాక్సినేషన్ కార్యక్రమాన్ని త్వరగా పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ వైద్యారోగ్యశాఖ మంత్రిని, అధికారులను ఆదేశించారు. ఇందుకోసం అన్నిజిల్లాల మంత్రులు, కలెక్టర్లు సమీక్షా సమావేశాలు నిర్వహించుకోవాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen + nineteen =