తెలంగాణలో రూ.20,761 కోట్లతో అమెజాన్ వెబ్ సర్వీసెస్ మల్టీ డేటా సెంటర్లు, కేటిఆర్ ప్రకటన

Amazon Web Services, AWS to set up Multiple Data Centers, FDI in India, KTR, Largest FDI in Telangana, Minister KTR, Minister KTR Announced Largest FDI in Telangana, telangana, Telangana FDI, Telangana gets its largest FDI, Telangana News

తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమైన పెట్టుబడికి సంబంధించి శుక్రవారం నాడు ప్రకటన చేయనున్నట్టు రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖ మంత్రి కేటిఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం‌ ఉద‌యం 11:30 గంట‌ల స‌మ‌యంలో అతిపెద్ద విదేశీ ప్ర‌త్య‌క్ష పెట్టుబ‌డులు‌పై మంత్రి కేటిఆర్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. “తెలంగాణ చరిత్రలో అతిపెద్ద ఎఫ్‌డిఐను ప్రకటిస్తునందుకు సంతోషంగా ఉంది. వరుస సమావేశాల తరువాత, తెలంగాణలో రూ.20,761 కోట్లతో( 2.77 బిలియన్ డాలర్లు) మల్టీ డేటా సెంటర్లను ఏర్పాటు చేయడానికి అమెజాన్ వెబ్ సర్వీసెస్(ఏడబ్ల్యుఎస్) సంస్థ పెట్టుబడిని ఖరారు చేసింది. 2022 మధ్య నాటికి అమెజాన్ వెబ్ స‌ర్వీసెస్ సంస్థ హైదరాబాద్ రీజియన్ లో తన కార్యకలాపాలను ప్రారంభిస్తుందని భావిస్తున్నాము” అని మంత్రి కేటిఆర్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eight + 19 =