బీఆర్‌ఎస్‌ ఆవిర్భావ వేడుకలు.. ఈ నెల 25న రాష్ట్రవ్యాప్తంగా పార్టీ జెండా ఎగురవేయాలి – బీఆర్‌ఎస్‌ కార్యకర్తలకు మంత్రి కేటీఆర్‌ పిలుపు

Minister KTR Calls BRS Cadre To Hoist Party Flag on April 25th Across Telangana During Foundation Day Celebrations,Minister KTR,Calls BRS Cadre,BRS Cadre To Hoist Party Flag,BRS Cadre To Hoist Party Flag on April 25th,Telangana Foundation Day Celebrations,BRS Foundation Day Celebrations,CM KCR News And Live Updates, Telangna Congress Party, Telangna BJP Party, YSRTP,TRS Party, BRS Party, Telangana Latest News And Updates,Telangana Politics, Telangana Political News And Updates

భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌, పూర్వపు టీఆర్ఎస్) ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించడానికి పార్టీ సమాయత్తమవుతోంది. దీనిలో భాగంగా ఈనెల 25న రాష్ట్రవ్యాప్తంగా.. ప్రతి గ్రామంలో, మున్సిపల్‌ వార్డుల్లో పార్టీ జెండా ఎగురవేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు మంత్రి కేటీ రామారావు. ఈ మేరకు ఆయన మంగళవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో దీనికి సంబంధించిన వివరాలను మీడియాతో వెల్లడించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. ఈ నెల 27న పార్టీ ఆవిర్భావ దినోత్సవం నాడు భారత రాష్ట్ర సమితి కేంద్ర కార్యాలయమైన తెలంగాణ భవన్‌లో పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం జరుగుతుందని, దీనికి దాదాపు 300 మంది ప్రతినిధులు హాజరవుతారని తెలిపారు.

ఇక ఈ సమావేశాల్లో భాగంగా పార్టీ పతాక ఆవిష్కరణ చేసి, పలు కీలక అంశాలపై తీర్మానాలు, చర్చలు నిర్వహిస్తామని మంత్రి కేటీఆర్‌ వెల్లడించారు. ప్రతి గ్రామంలో, మున్సిపల్‌ వార్డుల్లోని ప్రతి డివిజన్‌లో పార్టీ జెండా ఎగురవేసి సమావేశం నిర్వహించే బాధ్యత నియోజకవర్గ ఇన్‌ఛార్జిలదే అని పేర్కొన్నారు. అలాగే ఇప్పటికే పలుచోట్ల ఆత్మీయ సమ్మేళనాలు జరుగుతున్నాయని, మరికొన్ని నియోజకవర్గాల్లో బహిరంగ సభల స్థాయిలో జరుగుతున్నాయని, వీటిని మే నెలాఖరు వరకు పొడిగిస్తున్నామని మంత్రి కేటీఆర్ వివరించారు. కాగా టీఆర్ఎస్, బీఆర్‌ఎస్‌ పార్టీగా మారిన తర్వాత జరుగుతున్న తొలి వ్యవస్థాపక దినోత్సవం ఇదే కావడం విశేషం. దీంతో పార్టీ అధిష్టానం ఈ వేడుకలను అద్భుతంగా నిర్వహించడానికి ఇప్పటినుంచే భారీ ఏర్పాట్లు చేస్తోంది.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen + fourteen =