పార్లమెంట్‌లో ప్రత్యేక ‘మిల్లెట్ లంచ్‌’ ఏర్పాటు చేసిన కేంద్రం.. ప్రధాని మోదీ సహా పలువురు ప్రముఖులు హాజరు

PM Modi Shares Table With Rajya Sabha Chairman Jagdeep Dhankar and Kharge at Special Millet Lunch in Parliament,PM Modi Shares Table,Rajya Sabha Chairman Jagdeep Dhankar,Congress Leader Mallikarjun Kharge,Special Millet Lunch in Parliament,Mango News,Mango News Telugu,Indian Prime Minister Narendra Modi,PM Modi Latest News and Updates,Parliment Sessions,Indian Parliment Session,Parliment Session Latest News and Updates,Pariliment Sessions 2022,Indian Parliment Sessions

మిల్లెట్ ఇయర్ 2023ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం మంగళవారం మధ్యాహ్నం పార్లమెంట్‌లో ప్రత్యేక ‘మిల్లెట్ లంచ్‌’ ఏర్పాటు చేసింది. ఈ మేరకు వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర తోమర్‌ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఇక ఈ లంచ్‌లో తోటి పార్లమెంటు సభ్యులతో కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. సుమారు 40 నిమిషాల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన పలువురు ప్రముఖులతో కలిసి టేబుల్ షేర్ చేసుకోవడం విశేషం. భోజనం చేస్తున్నప్పుడు ప్రధాని మోదీ పక్కన ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, మాజీ ప్రధాని హెచ్‌డి దేవెగౌడ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తదితరులు కూర్చున్నారు.

కాగా దీనికి సంబంధించిన ఫోటోను ప్రధాని మోదీ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ప్రధాని మోదీ దీనిని గురించి ట్విట్టర్‌లో.. ‘మేము 2023ని అంతర్జాతీయ మిల్లెట్స్ సంవత్సరంగా గుర్తించడానికి సిద్ధమవుతున్న తరుణంలో, పార్లమెంట్‌లో మిల్లెట్ వంటకాలు వడ్డించే విలాసవంతమైన భోజనానికి హాజరయ్యాము. పార్టీలకు అతీతంగా పాల్గొనడం ఆనందంగా ఉంది’’ అని పేర్కొన్నారు. కాగా దీనికి ముందు రాజస్థాన్‌లోని అల్వార్‌లో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే చేసిన కొన్ని వ్యాఖ్యలకు సంబంధించి మంగళవారం ఉదయం రాజ్యసభలో అధికార మరియు ప్రతిపక్ష పార్టీల మధ్య వాగ్వాదం జరిగిన విషయం తెలిసిందే.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen − five =