సిద్దిపేట జిల్లా మంగోల్‌లో మిషన్‌ భగీరథ ట్రయల్‌ రన్‌.. ప్రారంభించిన మంత్రులు హరీశ్‌ రావు, ఎర్రబెల్లి దయాకర్‌ రావు

Ministers Harish Rao and Errabelli Dayakar Rao Started The Trail Run of Mission Bhagiratha at Mangole Siddipet District,Ministers Harish Rao , Errabelli Dayakar Rao ,Started The Mission Bhagiratha Trial Run,Mission Bhagiratha Trial Run In Mongol,Mission Bhagiratha Trial Run Siddipet District,Mango News,Mango News Telugu,Mission Bhagiratha,Mission Bhagiratha Trial Run,Mission Bhagiratha Trial Run Siddipet,CM KCR News And Live Updates, Telangna Congress Party, Telangna BJP Party, YSRTP,TRS Party, BRS Party, Telangana Latest News And Updates,Telangana Politics, Telangana Political News And Updates

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్‌ భగీరథలో భాగంగా ఆరు జిల్లాల్లో నీళ్ల పంపిణీని స్థిరీకరించేందుకు ఉపయోగపడే భారీ ప్రాజెక్టుకు సోమవారం ట్రయల్‌ రన్‌ నిర్వహించారు. ఈ మేరకు మంత్రులు హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్‌ రావులు ఈ ట్రయల్‌ రన్‌ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కాగా మల్లన్న సాగర్‌ నుంచి గోదావరి జలాలను తరలించేందుకు సిద్దిపేట జిల్లా కొండపాక మండలం మంగోల్‌ వద్ద రూ.1,212 కోట్లతో నిర్మించిన భారీ రిజర్వాయర్‌ను త్వరలోనే ప్రారంభించడానికి ముందుగా ప్లాంట్ పనితీరును పరిశీలించడానికి ఈరోజు ట్రయల్‌ రన్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన అతిపెద్ద జలాశయం మల్లన్నసాగర్ నుంచి కుకునూర్ పల్లి (మం) మంగోల్ గ్రామం వద్ద నిర్మించిన నీటి శుద్దికరణ ప్లాంట్ ట్రయిల్ రన్ ప్రారంభం. ఈ ప్లాంట్ ద్వారా సిద్దిపేట, మేడ్చల్, యాదాద్రి, జనగామ జిల్లాలకు మిషన్ భగీరథ ద్వారా త్రాగు నీటి శాశ్వత పరిష్కారం కానుంది.. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ గారికి ధన్యవాదాలు అని పేర్కొన్నారు.

మరో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్టు ద్వారా ఆరు జిల్లాల్లోని సిద్దిపేట, గజ్వేల్‌, దుబ్బాక, జనగామ, పాలకుర్తి, స్టేషన్‌ఘనపూర్‌, ఆలేరు, భువనగిరి, మేడ్చల్‌ (రింగురోడ్డు అవుట్‌ సైడ్‌) నియోజకవర్గాలకు తాగునీరు అందించనున్నట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతంలో ఒక వ్యక్తికి రోజుకు 100 లీటర్లు, మున్సిపాలిటీలో ఒక వ్యక్తికి 135 లీటర్లు అందించేలా ప్రణాళికలు రూపొందించామని, ప్రస్తుతం హైదరాబాద్‌ మెట్రో వాటర్‌ సప్లయ్‌ అండ్‌ స్టోరేజీ (హెచ్‌ఎండబ్ల్యూఎస్‌)కు వెళ్లే నీటి నుంచి జనగామ, గజ్వేల్‌, ఆలేరు, భువనగిరి, మేడ్చల్‌ గ్రిడ్‌లకు తాగునీటిని అందిస్తున్నామని వివరించారు. ఇక 6 జిల్లాల పరిధిలోని 9 నియోజకవర్గాలకు ప్రస్తుతం ఉన్న సిస్టమ్‌ ద్వారానే గోదావరి జలాలను తరలించి మల్లన్నసాగర్‌ రిజర్వాయర్‌ నుంచి నీటిని సరఫరా చేయనున్నామని, అలాగే మల్లన్నసాగర్‌ రిజర్వాయర్‌ సామర్థ్యం 50 టీఎంసీల కాగా, దీనిలో నుంచి 9.06 టీఎంసీల నీటిని తాగడానికి సరఫరా చేయనున్నామని వెల్లడించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × 3 =