రెండో దశ మెట్రో రైల్ లైన్ గొప్ప ప్రాజెక్టుగా నిలిచిపోతుంది, డిసెంబర్ 9న సీఎం కేసీఆర్ శంకుస్థాపన: మంత్రి తలసాని

Minsiter Talasani Srinivas Sabitha indra Reddy Inspects Arrangements for 2nd Phase of Metro Inauguration,Metro Corridor Extension, Rayadurgam To Shamshabad Dec9,KCR Foundation For Metro Corridor,Metro Corridor Hyderabad,Metro Corridor Extension Rayadurgam To Shamshabad,Rayadurgam To Shamshabad Metro Corridor,KCR Foundation Stone Metro On Dec 9,Mango News,Mango News Telugu,CM KCR News And Live Updates, Telangna Congress Party, Telangna BJP Party, YSRTP,TRS Party, BRS Party, Telangana Latest News And Updates,Telangana Politics, Telangana Political News And Updates,Telangana Minister KTR,Minsiter Talasani Srinivas,Minsiter Sabitha indra Reddy,2nd Phase of Metro Inauguration,Metro Inauguration

రెండో దశ మెట్రో రైలు లైను ఒక గొప్ప ప్రాజెక్టుగా నిలిచిపోతుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మంగళవారం రాజేంద్రనగర్ లోని పోలీస్ గ్రౌండ్ లో ఈ నెల 9వ తేదీన జరిగే ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు బహిరంగ సభ ఏర్పాట్లను మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డిలు, జీహెఛ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత, పలువురు ఎమ్మెల్యేలు, చైర్మన్లు, అధికారులతో కలిసి పరిశీలించారు. గ్రౌండ్ లో జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. సభకు వచ్చే వాహనాల రూట్, పార్కింగ్ ఏర్పాట్లు, ముఖ్యమంత్రి సభ వద్దకు వచ్చే రూట్, బందోబస్తు ఏర్పాట్లను పోలీసు అధికారులు వివరించారు. అనంతరం మైండ్ స్పేస్ జంక్షన్ వద్ద శంకుస్థాపన శిలాఫలకం ఏర్పాట్లను కూడా పరిశీలించారు.

అనంతరం మంత్రి తలసాని శ్రీనివాస్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, ఈ నెల 9 వ తేదీన ఉదయం 10.గంటలకు సీఎం కేసీఆర్ మైండ్ స్పేస్ జంక్షన్ వద్ద నుండి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వరకు 31 కిలోమీటర్ల మేర నిర్మించనున్న మెట్రో రైలు లైన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారని చెప్పారు. అనంతరం అక్కడి నుండి రాజేంద్ర నగర్ పోలీస్ గ్రౌండ్ కు చేరుకొని ఇక్కడ ఏర్పాటు చేసే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారని తెలిపారు. గ్లోబల్ సిటీ గా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ నగరం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ నాయకత్వంలో మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో అన్ని రంగాలలో ఎంతో అభివృద్ధి సాధించిందని అన్నారు. ఫ్లై ఓవర్ లు, అండర్ పాస్ లు, లింక్ రోడ్ల అభివృద్ధి వంటి పనులు చేపట్టడం జరిగిందని తెలిపారు. ప్రపంచంలోని అనేక నగరాలతో హైదరాబాద్ అభివృద్ధి లో పోటీ పడుతుందని, ఇది మనకెంతో గర్వకారణం అన్నారు. మెట్రో రైలు సౌకర్యం హైదరాబాద్ నగర కలల ప్రాజెక్టు అని, రెండో దశ కోసం ఎదురు చూస్తున్న ప్రజల కల త్వరలోనే సాకారం కాబోతుందని ప్రకటించారు. ఇప్పటికే 63 కిలోమీటర్ల మేర మొదటి దశలో మెట్రో రైలు సేవలు అందుతున్నాయని వివరించారు.

ఇప్పటి వరకు 30 కోట్ల మంది వరకు మెట్రో రైలులో ప్రయాణిస్తూ ఎంతో ఆదరిస్తున్నారని అన్నారు. కాలుష్య రహిత ప్రయాణం, తక్కువ సమయంలోనే గమ్యస్థానం చేరుకొనేందుకు మెట్రో రైలు ప్రయాణం ఎంతో సౌకర్యవంతంగా మంత్రి ఉంటుందని చెప్పారు. రెండో దశ ప్రాజెక్టుతో ఐటి కారిడార్ తో పాటు ఎయిర్ పోర్ట్ కు వెళ్ళే ప్రయాణీకులకు కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. అంతటి గొప్ప ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తున్న సీఎం కేసీఆర్ కి ఘనస్వాగతం పలకనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. ఈ కార్యక్రమం లో మున్సిపల్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ అరవింద్ కుమార్, ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యేలు మాగంటి గోపినాద్, ప్రకాష్ గౌడ్, అరికేపూడి గాంధీ, జైపాల్ యాదవ్, కిషన్ రెడ్డి, కాలే యాదయ్య, ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు, జెడ్పి చైర్మన్ అనిత, కార్పోరేషన్ చైర్మన్ లు రావుల శ్రీధర్ రెడ్డి, గజ్జెల నగేష్, బీసీ కమిషన్ సభ్యులు కిషోర్ గౌడ్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీపెన్ రవీంద్ర, పోలీసు అధికారులు శిల్పవల్లి, శ్రీనివాసరావు, టీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జిలు ఆనంద్ గౌడ్, సలా ఉద్దిన్ లోది, జీవన్ సింగ్, తదితరులు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 − 6 =