రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదలపై సీఎం కేసీఆర్ అత్యవసర సమీక్ష

CM KCR Meeting on Heavy Rains, CM KCR will hold an Emergency High-level Review Meeting, Heavy Rains In Hyderabad, KCR Meeting Heavy Rains and Flood Situations, KCR Meeting on Rains, Telangana CM KCR, Telangana Floods Live Updates, Telangana rains, Telangana rains live updates, telangana rains news, telangana rains updates

రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదలపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు ప్రగతిభవన్ లో ఉన్నత స్థాయి అత్యవసర సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమీక్షలో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితిని చర్చించనున్నారు. అలాగే తీసుకుంటున్న చర్యలు, తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తారు. భారీ వర్షాలు, వరదల వల్ల జరిగిన నష్టంపై కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించాల్సి ఉన్నందున, ఈ సమావేశానికి వచ్చే అధికారులు అన్ని వివరాలు తీసుకొని రావాల్సిందిగా సీఎం కేసీఆర్ ఆదేశించారు.

మున్సిపల్, వ్యవసాయ, ఆర్అండ్ బి, విద్యుత్ శాఖ మంత్రులు కె.టి. రామారావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, జగదీష్ రెడ్డి మరియు హైదరాబాద్ నగరానికి చెందిన మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, జెన్ కో సిఎండి ప్రభాకర్ రావు, ఎస్ పిడిసిఎల్ సిఎండి రఘుమారెడ్డి, మున్సిపల్, వ్యవసాయ, ఆర్ అండ్ బి శాఖల ముఖ్య కార్యదర్శులు, జీహెఛ్ఎంసీ కమీషనర్, హైదరాబాద్ కలెక్టర్లను ఈ సమావేశానికి ఆహ్వానించారు. ఆయా శాఖల పరిధిలో జరిగిన నష్టం వివరాలు సమావేశానికి తీసుకురావాల్సిందిగా సీఎం కేసీఆర్ ఆదేశించారు. భారీ వర్షాల వల్ల తలెత్తిన పరిస్థితి, తీసుకుంటున్న పునరావాస చర్యలు, తీసుకోవాల్సిన చర్యలు, కేంద్రానికి పంపాల్సిన నివేదికలో పేర్కొనాల్సిన అంశాలు తదితర విషయాలపై ఈ సమావేశంలో కీలక సమీక్ష జరుపనున్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

6 + 16 =