ప్రివెంట్యూ డిటర్మినేషన్‌ పద్ధతి అంటే ఏంటి?

Do you know the special rules in the polling booth,Do you know the special rules,special rules in the polling booth,polling booth,Mango News,Mango News Telugu,Telangana Assembly Election 2023, voters, leaders ,BRS,BJP,Congress, polling booth,Preventive Determination Method,Telangana Assembly Elections Latest News,Telangana Assembly Elections Latest Updates,Telangana Politics, Telangana Political News And Updates,Rules in the polling booth Latest Updates
Telangana Assembly Election 2023, voters, leaders ,BRS,BJP,Congress, polling booth,Preventive Determination Method,

18 ఏళ్లు నిండిన భారత పౌరులందరూ భారత రాజ్యాంగం ప్రకారం  ఓటు హక్కును  పొందొచ్చు . చివరకు జైలు శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశాన్ని భారత రాజ్యాంగం కల్పించింది.  వివిధ నేరాల్లో జైలు శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు ప్రివెంట్యూ డిటర్మినేషన్‌ పద్ధతిలో తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చు.

ఖైదీలు తమ నియోజకవర్గం పేరును సూచిస్తూ.. తాము ఏ పోలింగ్‌ బూత్‌‌లో ఓటర్లో తెలియజేస్తూ, ఓటరు క్రమసంఖ్యతో సహా చెప్పి ఓటేసే అవకాశం కల్పించాలని కోరుతూ జైలర్‌కు రాతపూర్వకంగా వివరాలను అందించాలి. దీంతో ఖైదీలు సూచించిన ప్రాంతాల నుంచి.. జైలర్ పోస్టల్‌ బ్యాలెట్లను తెప్పించి జైలు నుంచే ఓటేసే అవకాశాన్ని కల్పిస్తారు. ఈ ప్రాసెస్‌ను  ప్రివెంట్యూ డిటర్మినేషన్‌ పద్ధతి అంటారు.

పోలింగ్‌ రోజు పాటించాల్సిన కొన్ని విషయాలను ఓటర్లు ముందుగా తెలుసుకోవాలి.  తాము పోలింగ్ కోసం వెళ్తూ ఎవరికి ఓటు వేయాలనుకుంటున్నామనే విషయాన్ని ఓటరు బయటకు చెబితే .. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించినట్లుగా అధికారులు భావిస్తారు. ఆ వ్యక్తిని ఓటు వేయడానికి కూడా అనుమతించరు. అలాగే అంధులు ఓటు వేయాలనుకుంటే వాళ్లకు సహాయకులుగా 18 ఏళ్లు నిండిన వారిని  అధికారులు పోలింగ్‌ కేంద్రానికి అనుమతిస్తారు. అయితే అలా సహాయకుడిగా వెళ్లే వ్యక్తి ఏదైనా గుర్తింపు కార్డు తీసుకుని వెళ్తేనే వారిని అధికారులు అనుమతిస్తారు.

మరోవైపు ఓటు వేయడానికి వెళ్లే ఓటరు.. పోలింగ్‌ బూత్‌లో  అప్పటికే తన ఓటు ఎవరైనా వేసినట్లు గుర్తిస్తే వెంటనే పోలింగ్‌ అధికారులకు ఫిర్యాదు చేయవచ్చు. అతని  ఐడెంటిటీ కార్డును పరిశీలించి.. అన్ని ఆధారాలు కరెక్టుగా ఉంటే  అది టెండర్‌ ఓటుగా అధికారులు పరిగణిస్తారు. తర్వాత పోలింగ్‌ అధికారుల దగ్గర ఉండే ప్రత్యేక బ్యాలెట్‌ పేపర్‌ ద్వారా.. పాత పద్ధతిలో ఓటు హక్కును వినియోగించుకోవచ్చు

అంతేకాదు ఎవరైనా ఓటు వేయడానికి వచ్చినప్పుడు అది బోగస్‌ ఓటు అని గానీ, తక్కువ వయస్సు అని కానీ పోలింగ్‌ ఏజెంట్లు వారిని అడ్డుకుంటే.. పోలింగ్‌ అధికారి ఏజెంట్‌ నుంచి అన్ని విషయాలను సేకరిస్తారు. దీనిపై అప్పటికప్పుడు ప్రాథమిక విచారణ జరిపి.. ఏజెంట్లు చేసిన ఆరోపణ నిజమైతే ఆ ఓటరును పోలీస్‌ సిబ్బందికి అప్పగిస్తారు.

అలాగే ఒక ఓటరు తాను నచ్చిన పార్టీకి ఓటు వేసినా కూడా అది వేరే పార్టీకి పడిందనే ఆరోపణలు చేస్తే మాత్రం.. అధికారులు టెస్టు ఓటును అనుమతిస్తారు. అయితే ఆ ఆరోపణలు రుజువు కాకపోతే మాత్రం.. అతనిపై చర్యలు తీసుకుంటామని కూడా ముందుగానే ఆ ఓటరును హెచ్చరిస్తారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

six + six =