తెలంగాణలో ప్రారంభమైన కొత్త రేషన్ కార్డుల పంపిణీ

Distribution of new ration cards, Distribution of new ration cards set to begin in Telangana, Mango News, New Ration Cards Distribution, New ration cards distribution in Telangana, New Ration Cards Distribution Started, New Ration Cards Distribution Started Across the Telangana, New Ration Cards Distribution Started Across the Telangana State, New ration cards to be distributed, Telangana govt starts distribution of new ration cards, Telangana New Ration Cards Distribution

రాష్ట్రంలో జూలై 26 నుంచి కొత్త రేషన్ కార్డుల పంపిణీని ప్రారంభించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ను ఇటీవలే ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జూలై 26, సోమవారం నాడు రాష్ట్రవ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభమైంది. ఇప్పటికే దరఖాస్తు చేసుకుని అర్హత పొందిన 3 లక్షల మందికిపైగా లబ్ధిదారులకు ఆయా నియోజకవర్గాల్లోని మంత్రులు, ఎమ్మెల్యేల ఆధ్వర్యంలోనే రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం కొనసాగుతుంది.

ముందుగా పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డితో కలిసి లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులు అందజేసి ఈ కారక్రమాన్ని ప్రారంభించారు. ఇక స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి, జగదీష్ రెడ్డి సహా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు సంబంధిత ప్రాంతాల్లో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించి, అర్హులైన లబ్ధిదారులకు కార్డులను అందజేశారు. ఈ పంపిణీ కార్యక్రమం జూలై 26 నుంచి 31 తారీఖు దాకా జరగనుండగా, కొత్త రేషన్ కార్డు లబ్ధిదారులకు ఆగస్టు నెల నుంచే రేషన్ బియ్యం అందచేయనున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty + three =