తెలంగాణలో హైరిస్క్ గ్రూపులకు స్పెషల్ కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభం : సీఎస్

COVID 19 Vaccine, COVID-19 vaccine updates, Mango News, Special Covid Vaccination Drive, Special Covid Vaccination Drive for High Risk Groups, Special Covid Vaccination Drive for High Risk Groups in Telangana Begins, Special Covid Vaccination Drive for High Risk Groups in Telangana Begins from Today, Special Covid Vaccination Drive In Telangana, Telangana begins vaccinating high risk groups, Telangana launches special vaccination drive, Vaccination Drive for High Risk Groups

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా స్పెషల్ వ్యాక్సినేషన్ డ్రైవ్ ద్వారా 3 రోజులలో 1.4 లక్షల మందికి పైగా ప్రజలకు వ్యాక్సినేషన్ వేయనున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు హైరిస్క్ గ్రూపులకు ప్రత్యేక వ్యాక్సినేషన్ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా ఈ రోజు ప్రారంభమైనదని సీఎస్ చెప్పారు. జీహెచ్ఎంసీలో 32 సెంటర్లు ఏర్పాటు చేశామని, వారం రోజుల పాటు వ్యాక్సినేషన్ కొనసాగుతుందని, ప్రతి రోజు 30 వేల మందికి వ్యాక్సినేషన్ వేయనున్నట్లు సీఎస్ తెలిపారు.

శుక్రవారం ఉదయం పబ్లిక్ గార్డెన్ కు ఎదురుగా ఉన్న రెడ్ రోస్ ఫంక్షన్ హాల్ లో హైరిస్క్ మరియు హైఎక్స్ పోజర్ ఉన్న ప్రజలకు మొదటి విడత వ్యాక్సినేషన్ వేస్తున్న కేంద్రాన్ని సీఎస్ సోమేశ్ కుమార్ తనిఖీ చేశారు. ఈ సెంటర్లలో వ్యాక్సినేషన్ ఉదయం 8 నుండి ప్రారంభమవుతుందని, అధికారులు గుర్తించి కూపన్లు జారిచేసిన వీధి వ్యాపారులు, కిరాణాషాపులు, పెస్టిసైడ్ షాపులలో పనిచేస్తున్న కార్మికులకు వ్యాక్సినేషన్ ఇవ్వడం జరుగుతుందన్నారు. వ్యాక్సినేషన్ కోసం వచ్చే ప్రజలకు జీహెచ్ఎంసీ అధికారులు చేసిన ఏర్పాట్ల పట్ల సీఎస్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వ్యాక్సినేషన్ కోసం వచ్చిన ప్రజలు తమకు వ్యాక్సినేషన్ సదుపాయాన్ని ఏర్పాటుచేసినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు సీఎస్ కు చెప్పారు. అనంతరం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ జర్నలిస్టుల వ్యాక్సినేషన్ కేంద్రాన్ని కూడా సీఎస్ సోమేశ్ కుమార్ సందర్శించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ, జీహెచ్ఎంసీ కమీషనర్ లోకేష్ కుమార్, హైదరాబాద్ కలెక్టర్ శ్వేతా మహంతి, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ జీ.శ్రీనివాస్ రావు తదితరులు పాల్గొన్నారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 − 14 =