టేబుల్ టెన్నిస్‌ ఆటగాళ్లను సత్కరించిన క్రీడా మంత్రి శ్రీనివాస్ గౌడ్

2019 Latest Sport News And Headlines, latest sports news 2019, Mango News Telugu, Sports Minister Srinivas Goud, sports news, Table Tennis Players, Table Tennis Players Snehit And Sreeja, Telangana Breaking News, Telangana Political Updates 2019

యూత్ టేబుల్ టెన్నిస్ చాంపియన్ షిప్ సాధించిన స్నేహిత్ ను, సౌత్ ఏషియన్ గేమ్స్ లో టేబుల్ టెన్నిస్ చాంపియన్ షిప్ విభాగంలో రెండు బంగారు పతకాలను సాధించిన ఆకుల శ్రీజాను రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ శాలువాలతో సత్కరించారు. జమ్ము కాశ్మీర్ లో జరిగిన జాతీయ స్థాయి పోటిల్లో యూత్ సింగిల్స్ టైటిల్ కైవసం చేసుకున్న స్నేహిత్ తెలంగాణ క్రీడా రంగానికి మంచి పేరు తెచ్చారని అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, 60 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత తెలంగాణకు చెందిన క్రీడాకారుడు స్నేహిత్ తోలి సారిగా ఈ టైటిల్ ను గెలుచుకోవడం సంతోషకరంగా ఉందని అన్నారు. రైల్వే టేబుల్ టెన్నిస్ కోచ్ గా ఉన్న సోమనాథ్ ఘోష్ ను రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సూచన మేరకు తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ(శాట్) కోచ్ గా నియమించిన తర్వాత టేబుల్ టెన్నిస్ లో మంచి ఫలితాలు వస్తున్నాయని చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ కు కృతజ్ఞతలు తెలుపుతూ, కోచ్ సోమనాథ్ ఘోష్ ను అభినందించారు.

అలాగే మహిళల టీమ్ విభాగంలో గోల్డ్ మెడల్ ను , డబుల్స్ విభాగంలో గోల్ట్ మెడల్ ను భారతదేశానికి అందించిన క్రీడాకారిణి ఆకుల శ్రీజా తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణమని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సారథ్యంలో తెలంగాణ రాష్ట్రం క్రీడా హబ్ గా రూపోందుతుందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో క్రీడాకారులుకు ప్రభుత్వ ఉద్యోగాలలో 2 శాతం రిజర్వేషన్లు కల్పించి క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నామన్నారు. అంతేగాక ఉన్నత విద్యను అభ్యసించడం కోసం 0.5 కోటాను అమలు చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో క్రీడా మౌళిక సదుపాయల కల్పనకు పెద్ద పీట వేస్తున్నామని, ఇప్పటికే 40 స్టేడియాల నిర్మాణం పూర్తి చేశామని పేర్కొన్నారు. గ్రామీణ క్రీడాకారులను క్రీడా శాఖ ద్వారా ప్రోత్సహిస్తున్నామని, రాష్ట్రంలో క్రీడా పాఠశాలల ద్వారా భవిష్యత్  క్రీడకారులను తయారు చేస్తున్నామని తెలిపారు. 2020 టోక్యోలో జరిగే ఒలంపిక్స్ కు  తెలంగాణ రాష్ట్రం నుండి ఎక్కువ మంది క్రీడాకారుల ప్రాతినిథ్యం వహించే విధంగా, పతకాలు సాధించేందుకు ప్రోత్సాహిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర రెడ్డి, టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ కార్యదర్శి ప్రకాష్ రాజ్, అమర్నాథ్ రెడ్డి, నర్సింహా రావు తదితరులు పాల్గొన్నారు.

[subscribe]

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen − sixteen =