ఈ నెల 18న ఖమ్మంలో బీఆర్‌ఎస్‌ తొలి భారీ బహిరంగ సభ.. హాజరుకానున్న ముఖ్యమంత్రులు విజయన్‌, కేజ్రీవాల్‌, భగవంత్‌మాన్‌

BRS Party Plans For First Public Meeting in Khammam on Jan 18th CMs Kejriwal Vijayan and Bhagwantman Likely To Attend,BRS Party Public Meeting,BRS Party Khammam Public Meeting,CM Kejriwal,CM Vijayan,CM Bhagwantman,Mango News,Mango News Telugu,CM KCR News And Live Updates, Telangna Congress Party, Telangna BJP Party, YSRTP,TRS Party, BRS Party, Telangana Latest News And Updates,Telangana Politics, Telangana Political News And Updates

టీఆర్ఎస్, బీఆర్‌ఎస్ పేరుతో జాతీయ పార్టీగా అవతరించిన తర్వాత రాష్ట్రంలో తొలి భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనుంది. కాగా ఖమ్మంలో జనవరి 18న నిర్వహించనున్న ఈ సభకు బీఆర్‌ఎస్‌ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అధ్యక్షత వహించనున్నారు. ఇక ఈ భారీ బహిరంగ సభకు ముఖ్య అతిథులుగా బీజేపీయేతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు ముగ్గురు హాజరుకానున్నారు. లెఫ్ట్ పార్టీ నేత, కేరళ సీఎం విజయన్‌, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ మరియు పంజాబ్‌ సీఎం భగవంత్‌మాన్‌లు పాల్గొననున్నారు. అలాగే ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్‌ యాదవ్‌ కూడా హాజరయ్యే అవకాశాలున్నాయని బీఆర్‌ఎస్ పార్టీ వర్గాలు తెలిపాయి. వీరితో పాటు మరికొందరు జాతీయస్థాయి నేతలు కూడా రావొచ్చని సమాచారం.

ఇక ఈ బహిరంగ సభ ద్వారా సీఎం కేసీఆర్ జాతీయ స్థాయిలో బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేయాలని భావిస్తున్నారు. దీనిలో భాగంగా దేశంలోని మూడు ప్రధాన పార్టీలైన సీపీఎం, సమాజ్‌వాదీ, ఆమ్ ఆద్మీ పార్టీలను ఒకే వేదికపైకి తీసుకురావడానికి చొరవ చూపిస్తున్నారు. తద్వారా బీఆర్‌ఎస్‌కు పలు జాతీయ పార్టీల మద్దతు ఉందని నిరూపించాలని పట్టుదలగా ఉన్నారు. అలాగే జాతీయ రాజకీయాల్లో బీఆర్‌ఎస్‌ పార్టీని బీజేపీకి ప్రత్యామ్నాయంగా చూపేందుకు సీఎం కేసీఆర్‌ ‘అబ్‌కీ బార్‌.. కిసాన్‌ సర్కార్‌’ నినాదంతో ముందుకెళ్లనున్నారు. 2001 ఏప్రిల్‌ 27న టీఆర్‌ఎస్‌ ఆవిర్భావం జరుగగా.. గతేడాది అక్టోబర్‌ 10, దసరా రోజున దానిని బీఆర్‌ఎస్‌గా మార్చుతున్నట్లు ప్రకటించిన సీఎం కేసీఆర్.. డిసెంబర్‌ 14న దేశరాజధాని ఢిల్లీలో బీఆర్‌ఎస్‌కు ప్రత్యేకంగా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eight − two =