టెన్త్‌ విద్యార్థులకు పరీక్షా సమయం 30 నిమిషాలు పొడిగింపు.. కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ విద్యాశాఖ?

Telangana Extra Time up to 30 Minutes will be Provided in Tenth Class Exams, Telangana SSC Public Exams duration extended, Telangana SSC Public Exams duration extended Extra Time up to 30 Minutes, Telangana SSC Public Examinations 2022 will get 30 minutes more time to complete their exam, Telangana SSC Public Examinations 2022, Class X exams Extra 30 mins benefit students, SSC Public Examinations 2022, 2022 SSC Public Examinations, SSC Public Exams duration extended, SSC Public Exams, SSC Public Exams Time extended up to 30 Minutes, Tenth Class Exams, SSC Exams, Telangana Tenth Class Exams, Public Examinations, SSC Public Examinations Latest News, SSC Public Examinations Latest Updates, Mango News, Mango News Telugu,

తెలంగాణ విద్యాశాఖ పదవ తరగతి విద్యార్థులకు శుభవార్త చెప్పనుందా? పదవ తరగతి పరీక్షల సమయం 30 నిమిషాలు పొడిగిస్తూ విద్యాశాఖ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా 2 గంటల 45 నిమిషాలుగా ఉండే పరీక్షా సమయాన్ని 3 గంటల 15 నిమిషాలకు పొడిగించాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సూచించినట్లు అధికారులు తెలిపారు. అయితే గత యేడాది కూడా ఇదే మాదిరిగా పరీక్షా సమయాన్ని పొడిగించారు. ఈ యేడాది 5 లక్షలకు పైగా విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే ఈ యేడాది పరీక్షలలో 70 శాతం సిలబస్‌నే అమలు చేస్తున్నామని, ప్రశ్నపత్రంలో చాయిస్ ప్రశ్నలు ఎక్కువగా ఇవ్వాలని మంత్రి పేర్కొన్నట్లు విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. దీంతో చాలా మంది విద్యార్థులు అధిక ఒత్తిడి లేకుండా పరీక్ష రాయడానికి ఇది ఉపయోగపడుతుందని విద్యాశాఖ అధికారులు పేర్కొన్నారు. తెలంగాణలో పదవ తరగతి పరీక్షలు మే 23వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకు నిర్వహించనున్నారు. అలాగే ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు పరీక్షా సమయం ఉండనుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 + 8 =