తెలంగాణలో ఇంట‌ర్ సెకండ్ ఇయర్ ఫ‌లితాల‌పై మార్గ‌ద‌ర్శ‌కాలు ఖ‌రారు

Inter second year results to be out soon, Intermediate Second Year Results, Mango News, telangana, Telangana Govt, Telangana Govt Finalises Guidelines for Intermediate Second Year Results, Telangana Inter 2nd Year Results 2021, Telangana State Board of Intermediate Education, TS Inter 2nd Year Results 2021, TS Inter 2nd Year Results 2021 With Marks, TS Inter 2nd Year Results 2021 With Marks Release Date, TS Inter Results, TS Inter Results 2021 Manabadi

రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో విద్యార్థుల ఆరోగ్యం దృష్టిలో ఉంచుకొని ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. అలాగే మార్కులకు సంబంధించి, విధి విధానాలను రూపొందించి ఫలితాలను ప్రకటించనున్నట్టు తెలిపారు. ఈ నేపథ్యంలో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం ఫలితాలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం మార్గదర్శకాలను ఖరారు చేసింది. సబ్జెక్ట్స్ లో ప్రథమ సంవత్సరంలో వచ్చిన మార్కులనే, ద్వితీయ సంవత్సరంకు కూడా కేటాయించాలని నిర్ణయించారు. అలాగే ద్వితీయ సంవత్సరం ప్రాక్టికల్ పరీక్షలకు పూర్తి మార్కులను కేటాయించ‌నున్నారు.

గతంలో ఫెయిల్ అయిన స‌బ్జెక్టుల‌కు 35 శాతం మార్కులు ఇవ్వనున్నారు. అలాగే బ్యాక్‌లాగ్స్ ఉన్నవారికి ఆ స‌బ్జెక్టుల‌కు ద్వితీయ సంవత్సరంలో కూడా 35 శాతం మార్కులతో, అలాగే ప్రైవేటుగా ద‌ర‌ఖాస్తు చేసుకున్న విద్యార్థులను 35 శాతం మార్కులతో పాస్ చేయనున్నారు. ఎవరైనా విద్యార్థిని/విద్యార్థులు ఈ విధానం ద్వారా ప్రకటించిన ఫ‌లితాల‌తో సంతృప్తి చెందకపోతే, పరిస్థితులు అనుకూలముగా ఉన్నప్పుడు వారికోసం ప్ర‌త్యేకంగా ప‌రీక్ష‌లు నిర్వ‌హించనున్నట్టు వెల్లడించారు. ఫలితాల విధివిధానాలు ఖరారు కావడంతో త్వరలోనే ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం ఫలితాలు వెల్లడయ్యే అవకాశముంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × two =