తెలంగాణలో ముగిసిన గ్రూప్-3 దరఖాస్తు గడువు, ఒక్కో పోస్టుకు పోటీ ఎంతమంది అంటే?

Telangana Group3 Application Process Closed A Total of 536477 Applications Reported, Telangana Group3 Applications, Group3 Application Process Closed, Group3 536477 Applications Reported, Telangana Group3 Process, Mango News, Mango News Telugu, Group 3 Notification,Date Of Telangana Formation,Group 3 Application,Group 3 Jobs And Salary,Group 3 Jobs In Telugu,Group 3 Notification 2023 Telangana,Group 3 Qualification In Telangana,Group 3 Syllabus Tspsc,Group 3 Telangana Syllabus,Telangana All Information,Telangana Group 3,Telangana Group 3 Syllabus,Tspsc Group 3 Educational Qualification,Tspsc Group 3 Salary

తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే గ్రూప్-1, గ్రూప్-4, గ్రూప్-2 ఉద్యోగాలకు సంబంధించి అభ్యర్థుల నుంచి భారీ సంఖ్యలో దరఖాస్తులు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా గ్రూప్-3 ఉద్యోగాలకు కూడా అభ్యర్థుల నుంచి భారీగా దరఖాస్తులు వెల్లువెత్తాయి. గ్రూప్‌-3 ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 23, గురువారంతో ముగిసింది. 1375 గ్రూప్‌-3 పోస్టులకు గానూ మొత్తం 5,36,477 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) తెలిపింది. దీంతో గ్రూప్-3 కి సంబంధించి ఒక్కో పోస్టుకు 390 మంది పోటీ పడనున్నారు. గ్రూప్-2 పరీక్ష విధానంలో మొత్తం మూడు పేపర్స్ ఉండగా, త్వరలోనే గ్రూప్-3 పరీక్ష షెడ్యూల్ ను టీఎస్‌పీఎస్సీ ప్రకటించనుంది.

ముందుగా గ్రూప్-3 కింద 1363 పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ) 2022, డిసెంబర్ 30న నోటిఫికేషన్ విడుదల చేసింది. అనంతరం అదనంగా మరో 12 జూనియర్ అసిస్టెంట్ పోస్టులను కలపడంతో మొత్తం పోస్టుల సంఖ్య 1375కి చేరింది. ఇందులో జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అకౌంటెంట్, సీనియర్ ఆడిటర్, అసిస్టెంట్ ఆడిటర్ పోస్టుల సహా పలు విభాగాలకు చెందిన పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టుల కోసం అర్హులైన అభ్యర్థులంతా కమిషన్ వెబ్‌సైట్‌ లో https://.tspsc.gov.in/ లో ఉంచే నిర్ణిత ప్రొఫార్మాలో జనవరి 24వ తేదీ నుంచి దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. కాగా ఫిబ్రవరి 23వ తేదీ సాయంత్రం 5 గంటలకు దరఖాస్తు గడువు ముగియడంతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 5,36,477 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని టీఎస్‌పీఎస్సీ తెలిపింది. అయితే చివరి మూడు రోజుల్లోనే 90 వేలకుపైగా దరఖాస్తులు వచ్చినట్టు తెలుస్తుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 + eleven =