తెలంగాణ హెల్త్ ప్రొఫైల్ పక్కాగా రూపొందించాలి, అధికారులకు మంత్రి హరీశ్ రావు ఆదేశాలు

Harish Rao, Health Minister, Health Minister Harish Rao, Health profile from Dec 1st week, Health Profile Program, Health Profile Program In Telangana, Mango News, Officials told to get cracking on TS Health Profile pilot, Telangana Health Minister Harish Rao, Telangana Health Profile, Telangana Health Profile for the first week of December, Telangana Health Profile Program, Telangana Health Profile Program Should Start in December First Week – Health Minister Harish Rao, Telangana health profile project

తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు సోమవారం బీఆర్కే భవన్ లో అధికారులతో వైద్య శాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. డిసెంబరు మొదటి వారంలో తెలంగాణ హెల్త్ ప్రోఫైల్ ప్రోగ్రాం ప్రారంభించేందుకు అంతా సిద్దం‌ కావాలని చెప్పారు. ముందుగా ములుగు, సిరిసిల్ల జిల్లాల్లో ఈ కార్య‌క్ర‌మాన్ని ప్ర‌యోగాత్మ‌కంగా ప్రారంభించనున్నారు. ఈ మేరకు హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫెర్ కమిషనర్ వాకాటి‌ కరుణ, హెల్త్ డెరెక్టర్ శ్రీనివాస్‌రావు, ఓఎస్డీ‌ గంగాధర్ లతో కమిటీ, ఏర్పాటు చేస్తునట్టు తెలిపారు. ఈ కమిటీ ములుగు, సిరిసిల్ల జిల్లాల్లో పర్యటించి, ఆ జిల్లా కలెక్టర్లు, జిల్లా వైద్య, ఆరోగ్య సిబ్బందితో కలిసి అవసరమైన సన్నాహక ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని సూచించారు. కాగా తెలంగాణ హెల్త్ పోఫైల్ లో ప్రస్తుతం ఎనిమిది‌ టెస్ట్ లు‌ చేస్తున్నారని, అదే తెలంగాణ డయాగ్నసిస్ ద్వారా అయితే 57 టెస్ట్ ‌లు చేయవచ్చని ఈ దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు. తెలంగాణ డయాగ్నసిస్ లో ఉపయోగించే ఎక్విప్మెంట్ ద్వారా ఆక్యురేట్ గా రిజల్ట్ వస్తాయని, వేగంగా పరీక్షలు నిర్వహించి రోజుకు పది టెస్ట్ లు చేయవచ్చుని అన్నారు.

ఇక ప్రతీ ఇంటికి వెళ్లి‌ ఆరోగ్య సమాచారం తీసుకోవాలని, నోడల్ ఆఫీసర్లను నియమించి వేగంగా జరిగేలా‌ చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశాలు ఇచ్చారు. అదేవిధంగా ములుగు, రాజన్న సిరిసిల్ల జిల్లాలలో ప్రయోగాత్మకంగా హెల్త్ ఫ్రోఫైల్ తయారు ఎలా తయారు చేయనున్నారో , ఆ వివరాలు తెలిపిన అధికారులు‌ మంత్రికి తెలిపారు. ఈ జిల్లాలలో ప్రతీ వ్యక్తి ఆరోగ్య సమాచారం, ఆధార్ నెంబర్, డెమోగ్రాఫిక్ వివరాలు, సుగర్ బీపీ, ఇతర వ్యాధుల సమాచారం సేకరించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ సమాచారం వల్ల వ్యక్తుల ఆరోగ్యానికి‌ సంబంధించిన రిస్క్ అసెస్మెంట్, హై రిస్క్ వాళ్లను గుర్తించడం జరుగుందన్నారు. అనంతరం వారికి అవసరమైవ వైద్య సేవలు అందించడం జరుగుతుందన్నారు. ఈ పరీక్షలు పూర్తయిన వారి ఆరోగ్య సమాచారం‌ డిజిటల్ రూపంలో క్లౌడ్ స్టోరేజి చేస్తారని, అందులో ప్రతీ వ్యక్తి ఆరోగ్య సమాచారం అంతా నిక్లిప్తం చేయటం‌ జరుగుతుందని వివరించారు. ప్రయోగాత్మకంగా రెండు‌ జిల్లాల్లో చేపట్టే ఈ ఆరోగ్య సమాచార సేకరణ పక్కాగా ఉండాలని అధికారులకు మంత్రి ఆదేశాలు ఇచ్చారు.

ఏ వ్యక్తి ఆసుపత్రికి వెళ్లినా, లేదా ఏ వ్యక్తి యాక్సిడెంట్ కు గురయినా అతని ఆరోగ్య ‌సమాచారం అంతా క్లౌడ్ స్టోరేజ్ నుండి తెప్పించుకునేలా ఉండాలని, అదే రీతిలో‌ రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ హెల్త్ ప్రోఫైల్ సమాచారం పకడ్బందీగా సేకరిస్తే ప్రభుత్వం సమర్ధవంతంగా ఆరోగ్య కార్యక్రమాలు నిర్వహించవచ్చన్నదే సీఎం కేసీఆర్ ఆలోచనని మంత్రి పేర్కొన్నారు. సమాచారం పక్కాగా ఉంటే రాష్ట్రంలో ఏ ప్రాంతంలో, ఏ వ్యాధులు ఎక్కువ ఉన్నాయి.‌ ఆ ప్రాంతంలో‌ఎలాంటి వైద్య సేవలు అవసరం, ఎలాంటి మందులు అవసరం, ఎలాంటి వైద్య నిపుణులు, అవసరమైన మెడికల్‌ డివైసెస్ అవసరమో తెలుస్తుందని మంత్రి హరీశ్ రావు తెలిపారు. ఈ సమీక్షలో హెల్త్ సెక్రటరీ ఎస్ఏఎం రిజ్వీ, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ వాకాటి కరుణ, పబ్లిక్ హెల్త్ డెరెక్టర్ జి. శ్రీనివాస్‌రావు, తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ రమేష్ రెడ్డి, ఓఎస్డీ గంగాథర్ తదితరులు పాల్గొన్నారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 2 =