తెలంగాణలో ఇంటర్మీడియట్ రీకౌంటింగ్‌, రీవెరిఫికేషన్‌ గడువు పెంపు

Recounting Deadline, telangana, Telangana Inter Board, Telangana Inter Board Extends Re-Verification Deadline, Telangana Inter Board Extends Recounting, Telangana Inter Board Extends Recounting Deadline, Telangana Inter Board Recounting, Telangana Inter Recounting Deadline

తెలంగాణ రాష్ట్రంలో జూన్ 18 న ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలను ఒకేసారి విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇంటర్‌ రీకౌంటింగ్‌, రీవెరిఫికేషన్‌ విషయంలో ఇంటర్‌ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. రీకౌంటింగ్‌, రీవెరిఫికేషన్‌ గడువును జూన్ 30 వరకు పొడిగిస్తూ బోర్డు నిర్ణయం తీసుకుంది. దీంతో విద్యార్థులు దరఖాస్తు చేసుకునేందుకు మరికొన్ని రోజులు సమయం లభించింది.

కాగా ఇటీవల విడుదలైన ఫలితాల్లో ఇంటర్ మొదటి సంవత్సరంలో 2.88 లక్షల మంది, రెండవ సంవత్సరంలో 2.83 లక్షల మంది ఉత్తీర్ణత సాధించారు. మొదటి సంవత్సర ఫలితాల్లో 67.4 శాతంతో, రెండవ సంవత్సరంలో 71.15 శాతంతో బాలికలు ఉత్తీర్ణత సాధించి ఫలితాల్లో పైచేయి సాధించారు. ఇక మొదటి సంవత్సరంలో 52.30 శాతం, రెండవ సంవత్సరంలో 62.10 శాతం మంది బాలురు ఉత్తీర్ణత సాధించారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 + four =