టీఆర్ఎస్ పార్టీ పేరు మార్పుపై బహిరంగ ప్రకటన జారీ

TRS Issued Public Notice on Name Change of TRS to Bharat Rashtra Samithi, TRS Party Public Note, Trs Party Name Change, TRS Party, TRS To Bharat Rashtra Samithi, Mango News,Mango News Telugu,Telangana Rasthra Samithi,BRS Party, TRS Party, TRS Latest News And Updates, Bharat Rashtra Samithi, TRS Issued Public Notice,TRS Name Change To BRS, BRS Party Name Changes, BRS Party Latest New And Live Updates

తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్టీ పేరును ‘భారత్ రాష్ట్ర సమితి’ గా మార్చుతూ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు 2022, అక్టోబర్ 5 దసరా నాడు తెలంగాణ భవన్ లో జరిగిన పార్టీ సర్వసభ్య సమావేశంలో తీర్మానాన్ని ప్రవేశపెట్టగా, ఆ తీర్మానాన్ని సర్వసభ్య సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించిన విషయం తెలిసిందే. టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్‌గా మార్చుతూ చేసిన తీర్మానం కాపీని పార్టీ నాయకులు ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ)కు అందజేయగా, ప్రస్తుతం ‘భారత్ రాష్ట్ర సమితి’ పేరుని అధికారికంగా నమోదు చేసే అంశం ఈసీ పరిధిలో ఉంది.

ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ పేరు మార్పుపై తాజాగా పలు పత్రికల్లో తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో పార్టీ అధ్యక్షుడు పేరిట బహిరంగ ప్రకటన/పబ్లిక్ నోటిస్ జారీ అయింది. ఎన్నికల సంఘం వద్ద నమోదైన తెలంగాణ రాష్ట్ర సమితి రాజకీయ పార్టీ పేరును భారత్ రాష్ట్ర సమితిగా మార్చుటకు ప్రతిపాదిస్తున్నామని ప్రకటనలో తెలిపారు. ప్రతిపాదిస్తున్న కొత్త పేరు పట్ల ఎవరికైనా ఏదైనా అభ్యంతరం ఉంటే వాటికీ గల కారణాలతో తమ అభ్యంతరాలను ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘం సెక్రటరీకి (పొలిటికల్ పార్టీ) ప్రచురణ తేదీ నుంచి 30 రోజుల్లోగా పంపించాలని కోరుతూ టీఆర్ఎస్ అధ్యక్షుడు పేరిట పబ్లిక్ నోటిస్ జారీ చేశారు. ఈ క్రమంలో ఎవరినుంచైనా అభ్యంతరాలు ఉంటే ఈసీ వాటిని పరిశీలన చేసిన అనంతరం, టీఆర్ఎస్ పేరు మార్పు ప్రతిపాదనపై ప్రకటన చేసే అవకాశం ఉంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty + one =