పార్ల‌మెంట్ లోని గాంధీ విగ్ర‌హం వద్ద నిరసన తెలిపిన టీఆర్ఎస్ ఎంపీలు.. తెలంగాణాలో న‌వోదయ విద్యాల‌యాల ఏర్పాటుకు డిమాండ్

TRS MPs Hold Protest At Gandhi Statue in Parliament To Demand For Navodaya Varsities in Telangana, TRS MPs Hold Protest At Gandhi Statue in Parliament, TRS MPs To Demand For Navodaya Varsities in Telangana, TRS MPs Hold Protest At Gandhi Statue, Protest At Gandhi Statue in Parliament, Gandhi Statue in Parliament, Gandhi Statue, Parliament, Navodaya Varsities in Telangana, Navodaya Varsities, Navodaya Varsities Latest News, Navodaya Varsities Latest Updates, Telangana Navodaya Varsities, TRS MPs, Mango News, Mango News Telugu,

దేశరాజధాని ఢిల్లీలో టీఆర్ఎస్ ఎంపీలు వరుసగా పలు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నిన్న ధాన్యం కొనుగోలు కోసం కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపిన టీఆర్ఎస్ ఎంపీలు ఈరోజు మరో కొత్త డిమాండ్ ను ముందుకు తెచ్చారు. తెలంగాణాలో న‌వోదయ విద్యాల‌యాలు కేటాయించాల‌నే ప్రతిపాదనను వినిపిస్తున్నారు. ఈ క్రమంలో పార్ల‌మెంట్ ఆవ‌ర‌ణ‌లోని గాంధీ విగ్ర‌హం ఎదుట టీఆర్ఎస్ ఎంపీలు నిర‌స‌న కార్య‌క్ర‌మం చేప‌ట్టారు. తెలంగాణ‌లోని అన్ని జిల్లాలలో న‌వోదయ విద్యాల‌యాలు ఏర్పాటుచేయాల్సిందిగా వారు కేంద్రప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నవోదయ విద్యాలయాల ఏర్పాటుపై ఉభయ సభల్లో టీఆర్ఎస్ ఎంపీలు వాయిదా తీర్మానం ఇచ్చారు. అయితే కేంద్రం వీటిపై చర్చిండానికి అనుమతించకపోవడంతో టీఆర్‌ఎస్‌ పార్టీ ఉభయ సభల నుంచి వాకౌట్‌ చేసింది.

ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో ధాన్యం సేకరణ విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వానికి, బీజేపీ నేతృత్వం లోని కేంద్ర ప్రభుత్వానికి మధ్య వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా నిన్న ప్రధాని మోదీకి లేక రాశారు. ఈ నేపథ్యంలోనే టీఆర్ఎస్ ఎంపీలు పలు డిమాండ్లను కేంద్ర ముందుంచుతున్నారు. లోక్ సభలో టీఆర్ఎస్ పక్ష నేత నామా నాగేశ్వరరావు, రాజ్యసభలో టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకులు కే. కేశవరావు వాయిదా తీర్మానం ఇచ్చారు. 33 జిల్లాలకు గానూ గతంలో 9 ఇచ్చారని, మిగిలిన 23 జిల్లాలో కొత్తగా నవోదయ విద్యాలయాలు ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్, ఎంపీలు వినతి పత్రం ఇచ్చినా కేంద్రం స్పందించడం లేదని మండిపడ్డారు. ఈ కార్య‌క్ర‌మంలో ఎంపీలు నామా నాగేశ్వ‌ర్ రావు, ప్ర‌భాక‌ర్ రెడ్డి, ప‌సునూరి ద‌యాక‌ర్, శ్రీనివాస్ రెడ్డి, బీబీ పాటిల్, వెంక‌టేశ్, రాములు తదితరులు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nine − two =