కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై అనర్హత వేటు ప్రజాస్వామ్యానికి బ్లాక్ డే – వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల

YSRTP Chief YS Sharmila Condemns Disqualification of Congress MP Rahul Gandhi,YSRTP Chief YS Sharmila Condemns,YS Sharmila Condemns Disqualification Of Rahul Gandhi,Congress MP Rahul Gandhi,YS Sharmila Condemns Disqualification of Rahul Gandhi,Mango News,Mango News Telugu,Rahul Gandhi Disqualified As Lok Sabha Member,Rahul Gandhi Disqualified From Lok Sabha,Rahul Gandhi Disqualified As MP,Congress MP Rahul Gandhi Latest News,Congress MP Rahul Gandhi Latest Updates,YSRTP Chief YS Sharmila Latest News

లోక్‌సభ సభ్యునిగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీపై అన‌ర్హ‌త వేటు వేయ‌డాన్ని ఖండిస్తూ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ (వైఎస్ఆర్‌టీపీ) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ట్వీట్ చేశారు. “ప్రతిపక్షాల గొంతునొక్కడం, కక్షసాధింపు చర్యలకు దిగడం ప్రజాస్వామ్యంలో తగదు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై అనర్హత వేటు ప్రజాస్వామ్యానికి బ్లాక్ డే. వాదనలు వినిపించేందుకు రాహుల్ గాంధీకి 30రోజుల సమయం ఉన్నా, లోక్ సభ సభ్యత్వాన్ని రద్దు చేయడం నిరంకుశ చర్య” అని వైఎస్ షర్మిల అన్నారు.

“ప్రజాస్వామ్యంలో అధికారపక్షం ఎంత ముఖ్యమో, ప్రతిపక్షం కూడా అంతే ముఖ్యం. రాజకీయ వైరుధ్యాల కంటే రాజ్యాంగ విలువలు గొప్పవి. బీజేపీ చర్యలు ప్రజాస్వామ్యానికి మచ్చతెచ్చేలా ఉన్నాయి. ప్రతిపక్షాలపై అణచివేత తగదు. పార్టీలకు అతీతంగా ప్రజాస్వామ్యాన్ని బతికించుకోవాల్సిన అవసరం ఉంది. సాధించుకున్న స్వాతంత్య్రంను కాపాడుకోవాలన్నా, రాసుకున్న రాజ్యాంగం అమలు కావాలన్నా, ఈ నిరంకుశ నిర్ణయాన్ని ముక్త కంఠంతో ఖండించడం ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్క పౌరుని బాధ్యత” అని వైఎస్ షర్మిల పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen + seven =