స్థానిక ఎంఐఎం నేతల మద్దతు ఎవరికి ?

Who is the support of the local MIM leaders,Who is the support,Local MIM leaders,MIM leaders,Mango News,Mango News Telugu,Bodhan Politics, minorities, minorities support, local MIM leaders,Telangana Assembly Elections 2023,BRS, Congress, Bjp,Mim Candidates Made Poll Debut In Ghmc Elections,local MIM leaders Latest News,local MIM leaders Latest Updates,local MIM leaders Live News,BRS Latest News,BRS Latest Updates
Bodhan Politics, minorities, minorities support, local MIM leaders,Telangana Assembly Elections 2023,BRS, Congress, Bjp,

మైనార్టీలు అత్యధికంగా ఉన్న నియోజకవర్గం.. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం. దీని  తర్వాత మైనార్టీలు ఎక్కువగా ఉండే మరో నియోజకవర్గం బోధన్‌. ఇక్కడ  బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే షకీల్ అమేర్ పోటీ చేస్తుండగా..కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి, భారతీయ జనతా పార్టీ నుంచి వడ్డి మోహన్‌రెడ్డి పోటీ చేస్తున్నారు.

బోధన్‌లో మైనార్టీలు ఎక్కువగా ఉండటంrతో.. మద్దతు ఏ పార్టీగా ఉంటుందో అనే చర్చ నడుస్తోంది. బోధన్‌లో మొత్తం ఓటర్ల సంఖ్య 2,20,068 మంది. అందులో మహిళలు 1,14,490 ఉండగా పురుషులు 1,05,573 మంది ఉన్నారు.అలాగే బోధన్‌లో మైనార్టీలు 30 శాతం వరకూ ఉన్నారు. దాదాపు 66 వేల మంది  మైనార్టీ ఓటర్లు ఉన్నారు. దీంతో మున్సిపల్ ఎన్నికల్లో.. పట్టణంలో మొత్తం 38 వార్డులు ఉండగా..అందులో  11 వార్డుల్లో ఎంఐఎం పార్టీకి చెందిన కౌన్సిలర్లే గెలుపొందారు.

కానీ బోధన్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు, ఎంఐఎం పార్టీతో అంత సఖ్యతగా మెలగడం లేదన్న వాదన వినిపిస్తోంది.  గతంలో రాకాసిపేట, రెంజల్ బేస్‌లో జరిగిన పట్టణ ప్రగతి కార్యక్రమం జరిగినప్పుడు..బీఆర్ఎస్ ఎమ్మెల్యేను ఎంఐఎం కౌన్సిలర్లు అడ్డుకున్నారు. బోధన్‌లో అభివృద్ధి ఎక్కడ జరిగిందో చూపించాలంటూ నిలదీశారు. అయితే తనను అడ్డుకున్న ఎంఐఎం కౌన్సిలర్ల దగ్గర మరణాయుధాలు ఉన్నాయని, తనను చంపటానికి ప్రయత్నించారని అప్పట్లో ఎమ్మెల్యే ఫిర్యాదు చేశారు. దీంతో  ఎంఐఎం కార్పొరేటర్లపై పోలీసులు కేసులు నమోదు చేయడంతో..ఆ సమయంలో ఇది  పెద్ద దుమారాన్నే రేపింది.

ఆ సమయంలో ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ కూడా బోధన్ పట్టణానికి వచ్చారు. ఎవరి అధికారం శాశ్వతం కాదని, ఆఎమ్మెల్యేకు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఓటుతోనే సమాధానం చెబుతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే  దీనికి కౌంటర్‌గా ఎమ్మెల్యే షకీల్.. అసదుద్దీన్ తనపై పోటీ చేయాలని సవాల్ విసిరారు. ఈ ఘటన జరిగిన తర్వాత నుంచి ఎంఐఎం నాయకులు బీఆర్ఎస్‌కు దూరంగా ఉన్నారు.  ఈసారి ఎన్నికల్లో ఎంఐఎం కూడా పోటీ చేస్తుందని

అయితే ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం  పోటీ చేస్తుందని అంతా భావించినా..ఎందుకో  దూరంగా ఉంది. దీంతో ఇప్పుడు మైనార్టీలంతా..తమ ఓట్లు ఎవరికి వేస్తారనేది ఆసక్తిగా మారింది.  అంతేకాదు కార్పొరేటర్లపై కేసులు, ఎమ్మెల్యే తీరుతో మున్సిపల్ ఛైర్ పపర్సన్ తూము పద్మ, ఆమె భర్త శరత్‌రెడ్డి కాంగ్రెస్‌ గూటికి చేరారు. పట్టణ ఓట్లలో కీలకమైన కార్పొరేటర్లు బీఆర్ఎస్‌కు దూరంగా ఉండటంతో పాటు, చైర్‌పర్సన్ పార్టీ మారడం బీఆర్ఎస్‌కు ఎదురు దెబ్బే. మరి ఇలాంటి పరిస్థితుల్లో షకీల్ అమేర్‌కు మైనార్టీ ఓట్లు పడతాయా అనేది అనుమానమే.

మరోవైపు రాష్ట్ర స్థాయిలో ఎంఐఎం పార్టీ.. బీఆర్ఎస్  పార్టీగా మద్దతు ఇస్తున్నా కూడా ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేకే టికెట్ ఇవ్వడంతో.. విచిత్ర పరిస్థితి నెలకొంది. ఒకవేళ ఎమ్మెల్యే మీద కోపంతో.. మైనార్టీ ఓట్లు కాంగ్రెస్‌కు  పడితే.. అధికార పార్టీకి తీవ్ర ఇబ్బందులే. పైగా మైనార్టీకి చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ.. నిజామాబాద్ అర్బన్ నుంచి బరిలోకి దిగడం, ఆ పార్టీ మైనార్టీ డిక్లరేషన్ ప్రకటించడం వల్ల క్షేత్రస్థాయిలో పరిస్థితులు మారే అవకాశాలున్నాయి. అయితే బోధన్‌లో లోకల్  ఎంఐఎం నేతలు మాత్రం.. ఇప్పటి వరకు మద్దతు అంశంపై ఎటువంటి కామెంట్లూ చేయలేదు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 2 =