ఏపీ ఆదాయ వనరులపై సమీక్ష.. సీఎం జగన్‌ కీలక సూచనలు

AP CM YS Jagan Review on Andhra Pradesh Revenue Sources, Key Tips To Officers

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదాయ వనరులు పెంచుకోవటంపై దృష్టి పెట్టింది. ఈరోజు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి దీనిపై సంబంధిత శాఖలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అదనపు ఆదాయాల కోసం వివిధ రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేయాల్సిందిగా ఆయన అధికారులను ఆదేశించారు. ఆయా రాష్ట్రాల్లో అవలంబిస్తున్న పద్ధతులు, విధానాలు పరిశీలించాలని సీఎం జగన్ సూచించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆదాయం పెరగడానికి అన్వేషణ చేయాలని ఆయన చెప్పారు. అలాగే, ఆదాయం పెంచుకునే క్రమంలో అధికారులు తమ విచక్షణాధికారాలను వీలైనంతవరకు సద్వినియోగం చేసుకోవాలని సీఎం జగన్ అన్నారు.

ప్రభుత్వానికి ఆదాయాన్ని తీసుకురావడంలో కలెక్టర్లదే యాక్టివ్ రోల్ అని సీఎం జగన్ స్పష్టం చేశారు. పెండింగ్‌లో ఉన్న వ్యాట్‌ కేసులను పరిష్కరించడం ద్వారా బకాయిలను రాబట్టుకోవడంపై దృష్టి సారించాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఈ అంశాలపై ఎప్పటికప్పుడు పురోగతిని సమీక్షించుకోవడానికి సంబంధిత శాఖలకు చెందిన అధికారులు క్రమం తప్పకుండా సమావేశం కావాలని ఆదేశించారు. గ్రామ, వార్డు సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్ల ప్రక్రియను వీలైనంత త్వరగా చేయాలని ఆయన అన్నారు. సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో జరిగే అవినీతి గ్రామ, వార్డు సచివాలయాల్లోకి రాకుండా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ స్పష్టం చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − 10 =