వైజాగ్‌లో మిలన్-2022 ఇంటర్నేషనల్ సిటీ పరేడ్‌.. రేపు పాల్గొననున్న సీఎం జగన్

AP CM YS Jagan To Be Participated in MILAN 2022 Tomorrow At Visakhapatnam, AP CM YS Jagan To Be Participated in MILAN 2022, Visakhapatnam, MILAN 2022 Tomorrow At Visakhapatnam, AP CM YS Jagan, AP CM, YS Jagan, YS Jagan Mohan Reddy, AP CM YS Jagan Mohan Reddy, Chief Minister of Andhra Pradesh, Andhra Pradesh, 2022 MILAN, MILAN Latest News, MILAN Latest Updates, Latest Updates On MILAN 2022, MILAN 2022 At Visakhapatnam, Jagan, Mango News, Mango News Telugu,

ఆదివారం వైజాగ్‌లో జరిగే మిలన్-2022 ఇంటర్నేషనల్ సిటీ పరేడ్‌కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. మధ్యాహ్నం వైజాగ్ చేరుకున్న అనంతరం సీఎం జగన్ నేవల్ డాక్‌యార్డ్‌కు వెళ్లి అక్కడ ఐఎన్‌ఎస్ వెలా సబ్‌మెరైన్‌ను సందర్శిస్తారు. ఆ తర్వాత.. సాయంత్రం బీచ్‌రోడ్డులోని సిటీ పరేడ్‌లో ఆపరేషన్‌ ప్రదర్శనను తిలకిస్తారు. సభను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. విశాఖ నగరం మిలన్ ఫెస్టివల్ కోసం అద్భుతంగా అలంకరించబడింది. దీనిని కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్ భట్ నేవీ ఆడిటోరియంలో ప్రారంభించనున్నారు. అనంతరం భారతీయ సంస్కృతిని చాటిచెప్పే మిలన్ ప్రాంతాన్ని ఆయన ప్రారంభిస్తారు.

దేశంలోని వివిధ ప్రాంతాల నుండి దాదాపు 40 హస్తకళల స్టాల్స్ తో పాటుగా పర్యాటక ప్రదేశాలను ప్రదర్శించడానికి టూరిజం శాఖ కూడా స్టాల్స్ ఏర్పాటు చేస్తోంది. అలాగే, అంతర్జాతీయ మరియు భారతీయ వంటకాలను అందించే ఫుడ్ స్టాల్స్ కూడా ఏర్పాటయ్యాయి. కొన్ని విదేశీ నౌకాదళాలు కూడా స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నాయి. అలాగే ఆది, సోమవారాల్లో మిలన్-2022 అంతర్జాతీయ సదస్సు జరగనుంది. ఇందులో 40 దేశాలు ఇందులో పాల్గొంటున్నాయి. 9 రోజుల పాటు జరుగనున్న ఈ వేడుకల్లో పాల్గొనేందుకు 10 విదేశీ నౌకలు ఇప్పటికే విశాఖ నౌకాశ్రయానికి చేరుకున్నాయి. గురువారం ఐదు నౌకలు రాగా శుక్రవారం నాటికి మరో నాలుగు నౌకలు వైజాగ్‌కు చేరుకున్నాయి.

INS డేగా వద్దకు చేరుకున్న P-8A US నేవీకి సంబంధించిన మల్టీ మిషన్ సముద్ర గస్తీ, నిఘా విమానాల సిబ్బందికి భారత నౌకాదళం ఘన స్వాగతం పలికింది. దాదాపు 2,000 మంది నౌకాదళ సిబ్బంది విదేశీ యుద్ధనౌకలతో వైజాగ్ చేరుకున్నారు. వీరు సిటీ పరేడ్, మల్టీడైమెన్షనల్ ఆపరేషన్, ఫ్లైపాస్ట్‌ ప్రదర్శనలో పాల్గొంటారు. ఈ సిటీ పరేడ్‌ను చూసేందుకు ఆదివారం ఆర్‌కె బీచ్ రోడ్‌లో పెద్ద సంఖ్యలో ప్రేక్షకులు తరలివచ్చే అవకాశం ఉంది. కాగా, సిటీ పరేడ్‌లో ముఖ్యమంత్రి పాల్గొననున్నందున జిల్లా కలెక్టర్ ఎ మల్లిఖార్జున్, పోలీసు కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా, నేవీ అధికారులతో కలిసి ముందస్తు భద్రతను ఏర్పాటు చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen + fifteen =