కొత్త పీఆర్సీతో ఉద్యోగుల జీతాలు తగ్గవు – సీఎస్‌ సమీర్‌ శర్మ

AP 11th PRC News, AP CS pressmeet on PRC, AP Employees PRC Fitment, AP Employees Salaries Will Not Go Down With New PRC, AP Employees Salaries Will Not Go Down With New PRC – CS Sameer Sharma, AP Govt Announcement On PRC, AP Govt Employees PRC, AP Govt Employees PRC News, AP Govt Employees PRC Status, AP Govt Employees PRC Updates, CS Sameer Sharma, Jagananna Salary Cut, Mango News, PRC Announcement in AP

కొత్త పీఆర్సీతో ఉద్యోగుల జీతాలు ఏమాత్రం తగ్గవని ఏపీ సీఎస్ సమీర్‌ శర్మ‌ స్పష్టం చేశారు. పీఆర్సీ విషయమై బుధవారం సమీర్‌ శర్మ‌ మీడియాతో మాట్లాడారు. కొత్త పీఆర్సీతో జీతాలు తగ్గుతాయన్న ప్రచారం అవాస్తవమని అన్నారు. కరోనా కష్ట​కాలంలో కూడా ఉద్యోగులకు ఐఆర్‌ ఇచ్చామని వివరించారు. పీఆర్సీ ఆలస్యం అవుతున్నందునే ఐఆర్‌ ఇచ్చామన్నారు. ఉద్యోగులందరినీ ప్రభుత్వం సమానంగానే చూస్తుందని తెలిపారు. ఐఏఎస్‌లకు ఎక్కువ జీతాలు వస్తున్నాయనడం అవాస్తవమని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగుల జీతాల బడ్జెట్‌ ఎక్కువగా ఉందని తెలిపారు. కరోనా వైరస్‌ వల్ల ప్రభుత్వ ఆదాయం తగ్గిపోయిందని ఆంధ్రప్రదేశ్‌ సీఎస్‌ సమీర్‌ శర్మ తెలిపారు. కరోనా లేకపోతే రాష్ట్ర రెవెన్యూ రూ.98 వేల కోట్లు ఉండేదని సమీర్‌ శర్మ చెప్పారు. కరోనా కారణంగా రాష్ట్ర రెవెన్యూ రూ.62 వేల కోట్లే ఉందని తెలిపారు.

ఫైనాన్స్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ రావత్‌ మాట్లాడుతూ.. 27 శాతం ఐఆర్‌ గతంలో ఎవరూ ఇవ్వలేదేని తెలిపారు. అందరికీ న్యాయం చేయడానికి సీఎం వైఎస్‌ జగన్‌ ప్రయత్నించారని చెప్పారు. విభజన కారణంగా ఏపీ ఆర్థికంగా నష్టపోయిందని తెలిపారు. ఏపీలో వ్యవసాయం ప్రధాన వృత్తిగా ఉందని చెప్పారు. వ్యవసాయం నుంచి పన్నుల ఆదాయం ఉండదని తెలిపారు. కేంద్రం నుంచి రావాల్సిన పన్నుల వాటా తగ్గిపోయిందని తెలిపారు. ఐఆర్‌ రూపంలో రూ. 17, 918 కోట్లు ఇచ్చామని వివరించారు. ఆశా వర్కర్లకు, అంగన్‌వాడీ, అవుట్‌ సోర్సింగ్‌ సిబ్బందికి గౌరవ వేతనం పెంచామని చెప్పారు. మధ్యాహ్న భోజన కార్మికులకు కూడా వేతనాలు పెంచామని చెప్పారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 − twelve =