హాకీ క్రీడాకారిణి రజనీకి రూ.25 లక్షల నగదు, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, సీఎం జగన్ ఆదేశాలు

Andhra Pradesh CM YS Jaganmohan Reddy, Andhra Pradesh Government, CM YS Jagan, CM YS Jagan Felicitated Hockey Player E Rajani, Hockey Player E Rajani, It is raining cash for Olympian Rajani in Andhra Pradesh, Mango News, Olympian Rajani, Women’s Hockey Team Player, YS Jagan Felicitates Indian Women’s Hockey Team Player

టోక్యో ఒలింపిక్స్ లో పాల్గొన్న భారత మహిళల హాకీ జట్టు సభ్యురాలు, ఆంధ్రప్రదేశ్ కు చెందిన హాకీ క్రీడాకారిణి ఇ.రజనీ బుధవారం నాడు తల్లిదండ్రులతో కలిసి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా హాకీ క్రీడాకారిణి రజనీని సీఎం వైఎస్ జగన్ శాలువాతో సత్కరించి, జ్ఞాపికను అందజేశారు. అలాగే హాకీలో ప్రతిభ చూపుతున్న రజనీకి సీఎం పలు ప్రోత్సాహకాలను ప్రకటించారు. ఆమెకు రూ.25లక్షల నగదుతో పాటుగా, ఆమె కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని అధికారులను సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు.

అదేవిధంగా తిరుపతిలో వెయ్యి గజాల నివాస స్థలం, నెలకు రూ.40వేల చొప్పున ఇన్సెంటివ్‌లు ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. చిత్తూరు జిల్లా ఎర్రావారిపాలెం గ్రామానికి చెందిన రజనీ 2016 రియో ఒలింపిక్స్, టోక్యో ఒలింపిక్స్-2020 లో పాల్గొన్నారు. మరోవైపు టోక్యో ఒలింపిక్స్ లో భారత మహిళల హాకీ జట్టు సంచనాలు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఒలింపిక్ చరిత్రలో తొలిసారిగా సెమీఫైనల్ కు చేరుకుంది. అయితే సెమీఫైనల్ లో ఓటమి, అనంతరం జరిగిన మ్యాచ్ లో కాంస్య పతకాన్ని కూడా మహిళల హాకీ జట్టు తృటిలో కోల్పోయింది. కాగా తమ పోరాటపటిమ, ప్రతిభతో దేశం మొత్తాన్ని ఆకట్టుకున్న మహిళా జట్టుపై రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తో పాటుగా పలువురు రాజకీయ, క్రీడా, సినీరంగ ప్రముఖులు సోషల్‌ మీడియా వేదికగా ప్రశంసలు కురిపించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 − four =