పలువురు సీనియర్ ఐఏఎస్‌, ఐపీఎస్ అధికారులను బదిలీ చేసిన ఏపీ ప్రభుత్వం

AP Government Issued Orders on Several IAS IPS Officers Transfer, AP Government Issued Orders on Several IAS Officers Transfer, AP Government Issued Orders on Several IPS Officers Transfer, IAS IPS Officers Transfer, IPS Officers Transfer, IAS Officers Transfer, AP Government, AP, AP Latest News, AP Latest Updates, Latest News on ap IAS IPS Officers Transfers, Latest News on ap IPS Officers Transfers, Latest News on ap IAS Officers Transfers, Jagan government, AP CM YS Jagan government, AP CM, AP CM YS Jagan, Mango News, Mango News Telugu,

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరోసారి పలువురు ఐఏఎస్‌, ఐపీఎస్ అధికారుల బదిలీలు, పోస్టింగ్‌లు జరిగాయి. ఈ మేరకు మంగళవారం నాడు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి కె.ఎస్‌.జవహర్‌రెడ్డిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించారు. టీటీడీ ఈవోగా కూడా అదనపు బాధ్యతలను ఆయనకే అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

ఏపీలో ఐఏఎస్ అధికారుల బదిలీల వివరాలు:

  • ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కె.ఎస్‌.జవహర్‌రెడ్డి నియామకం, టీటీడీ ఈవోగా కూడా కొనసాగింపు
  • జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శిగా శశిభూషణ్‌కుమార్‌, జీఏడీ సర్వీసెస్ ముఖ్య కార్యదర్శిగా కొనసాగింపు
  • పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నీరబ్‌కుమార్‌ ప్రసాద్‌
  • ఏపీ కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శిగా జీఎస్‌ఆర్‌కేఆర్‌ విజయ్‌కుమార్‌, డెవలప్మెంట్,ప్లానింగ్ సొసైటీ సీఈఓ, ప్రణాళికా శాఖ ముఖ్య కార్యదర్శిగా కొనసాగింపు
  • రవాణాశాఖ కమిషనర్‌గా ఎంటీ కృష్ణబాబుకు అదనపు బాధ్యతలు
  • క్రీడలు, యువజన సర్వీసులు, పర్యాటక, సాంస్కృతిక శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా రజత్‌ భార్గవకు అదనపు బాధ్యతలు
  • భూపరిపాలన ప్రధాన కమిషనర్ గా (సీసీఎల్ఏ) జి.సాయి ప్రసాద్
  • ఏపీపీఎస్‌సీ కార్యదర్శిగా బాబు ఏ కు అదనపు బాధ్యతలు.

ఏపీలో ఐపీఎస్ అధికారుల బదిలీల వివరాలు:

  • ప్రస్తుతం డీజీపీగా (పూర్తి అదనపు బాధ్యత) ఉన్న కసిరెడ్డి వి రాజేంద్రనాథ్‌రెడ్డికి ఏసీబీ చీఫ్ గా బాధ్యతలు, ఇంటిలిజెన్స్‌ చీఫ్ బాధ్యతలు నుంచి బదిలీ
  • ఏపీ ఇంటిలిజెన్స్‌ చీఫ్ గా పీ.సీతారామాంజనేయులు నియామకం
  • విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీజీగా శంఖబ్రత బాగ్చీ, తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ప్రస్తుతం కొనసాగుతున్న ఏపీఎస్పీ బెటాలియన్స్ అదనపు డైరెక్టర్ జనరల్ గా కూడా పూర్తి అదనపు బాధ్యత నిర్వహించేలా ఉత్తర్వులు.
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × three =