జగన్‌ను జనసేనానితో కంపేర్ చేస్తున్న వైసీపీ నేతలు

What Happens In YCP?, AP, Telangana, TDP, Janasena, BJP, Congress, YCP, YCP Leaders, Latest YCP Political News, CM Jagan, AP Live Updates, Andhra Pradesh, Political News, Mango News, Mango News Telugu
AP, Telangana, TDP, Janasena, BJP, Congress,YCP,What happens in YCP, YCP leaders

ఆరు గ్యారెంటీలు చూసి కాదు తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌ను గెలిపించింది. ఆత్మగౌరవం కోసం. అలాగే, వైసీపీ నేతలకు కావాల్సింది టికెట్లు మాత్రమే కాదు కనీస గౌరవం. నిజమే ఒకసారి ఆలోచిస్తే ఈ ఐదేళ్లలో  సీఎం జగన్ పార్టీ ఆఫీసుకు వచ్చినట్టు చూడటం కానీ వినడం కానీ జరగనే లేదు. అసలు వైసీపీకి పార్టీ ఆఫీసు ఎక్కడుందో చాలామందికి తెలీదు.  ఈ ఐదేళ్లలో ఎమ్మెల్యేలను, పార్టీ నేతలను, కార్యకర్తలను జగన్ పలకరించిందే లేదు.ఎంతో మంది పాత బిల్లులకు, టికెట్ కోసం,ఇతర పనులకు జగన్ కోసం పాకులాడటమే తప్ప వారెవ్వరికీ ఆయన అపాయింట్మెంట్ ఇచ్చిందే లేదు. దీంతోనే చాలామంది వైసీపీ నేతలు ఇతర పార్టీలలోకి వెళ్లిపోతున్నారు. .

హైదరాబాద్ నుంచి ఏపీలో పవన్ కళ్యాణ్ ఎప్పుడు అడుగుపెట్టినా మంగళగిరి పార్టీ ఆఫీసుకే వెళతారు. ఆ అడ్రస్‌తోనే ఆయనకు ఓటర్ కార్డు కూడా ఉంది. వచ్చిపోయే నేతలను కలుస్తుంటారు. పార్టీ ఇంపార్టెంట్ మీటింగ్స్ అన్నీ అక్కడే నిర్వహిస్తూ అందరికీ అందుబాటులో ఉంటుంటారు. ఇలాంటి వాతావరణం వైసీపీలో ఉండదు. కేవలం ఇద్దరు ముగ్గురు రెడ్ల ద్వారానే ఆదేశాలు వెళ్తాయి తప్ప.. జగన్ అక్కడ కనిపించరు.  మరీ అత్యవసరం అయితేనే..తప్పనిసరి పరిస్థితులలోనే ఇష్టం లేకుండానే కాలు పెడతారన్న వార్తలు చాలానే విన్నాం.

ఇలాంటి తీరు నచ్చకే  సిట్టింగ్ ఎంపీ బాలశౌరి, సిట్టింగ్ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు జనసేలోకి వచ్చారు. ఇప్పుడు జనసేన బలంగా చెప్పాల్సిన అంశం కూడా ఇదే. ఇప్పుడున్న పరిస్థితుల్లో నేతలకు కావాల్సింది టికెట్ మాత్రమే కాదు. వారికి కావాల్సింది గౌరవం. ఆ గౌరవం వైసీపీలో కనిపించడం లేదు. అందుకే ఇతర పార్టీలలోకి వస్తున్నారు. రాజకీయం చేయాలంటే డబ్బు కావాల్సిందే. పదవులు కావాల్సిందే కానీ దానికోసం అధినేత అహంకారాన్ని భరించక్కరలేదన్న వాదన చాలామంది వైసీపీ నేతల్లో కనిపిస్తోంది.

టికెట్లు ఇస్తామని ఊరించడమే కాకుండా.. టికెట్లు ఇచ్చి అభ్యర్థులను కూడా మార్చేయడంతో చాలామంది జగన్‌పై కోపాన్ని పెంచుకుంటున్నారు. నలుగురికీ చెప్పుకుని అన్ని ఏర్పాట్లు చేసుకుంటే సర్వేల లెక్కల పేరు చెప్పి తమను పక్కన పెట్టేయడం అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతోనే ఇప్పటికే చాలామంది ముఖ్య నేతలు టీడీపీ, జనసేన, కాంగ్రెస్, బీజేపీ కండువాలు కప్పుకుంటే మరికొంతమంది మాత్రం అవకాశం కోసం కాచుకుని కూర్చున్నారు. మొత్తంగా ఈ ఎన్నికలు వైసీపీకి అగ్ని పరీక్షలాంటివే.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nine + five =